YSRCP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త కష్టాలు మొదలయ్యాయా.. కుట్రలకు బలి కామని జనం చెబుతున్నారా?

YSRCP: ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి రోజుకు రాజుకుంటుందని చెప్పాలి. మరి 20 రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఇప్పటికే పెద్ద ఎత్తున అన్ని పార్టీ నేతలు ప్రచార కార్యక్రమాలను నామినేషన్లను దాఖలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా వైఎస్ఆర్సిపి నేతలు నామినేషన్లకు ప్రజలు రావాలంటే కూడా భయపడుతున్నారు. పెద్ద ఎత్తున డబ్బు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఎవరు ర్యాలీలకు సభలకు హాజరు కాని పరిస్థితి నెలకొంది.

ముఖ్యంగా విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగినప్పటి నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ ప్రచార కార్యక్రమాలకు బహిరంగ సభలకు వెళ్లాలి అంటే ప్రజలందరూ కూడా భయపడుతున్నారు ఎప్పుడు ఎలాంటి వివాదం జరుగుతుందని అందులో తప్పు చేయకపోయినా ఆ నేరం ఎవరిపై పడుతుందో అనే భయం అందరిలోనూ నెలకొంది. దీంతో వైఎస్ఆర్సిపి పార్టీ ప్రచార కార్యక్రమాలకు ఎవరు రాలేదు.

ఇకపోతే వైఎస్ఆర్సిపి నేతలు నామినేషన్ వేసే సమయంలో కూడా పెద్దగా కార్యకర్తలు ఎవరు లేరనే చెప్పాలి. డబ్బులు ఇచ్చి వెళ్లిన వారు చేసే కుట్రలకు తాము బలి కావాలని అనుకోవడం లేదు అంటూ ప్రజలు ఎవరు కూడా వైసిపి పార్టీ ప్రచార కార్యక్రమాలకు ర్యాలీలకు రాకపోవడంతో ఆ నేతలలో ఓటమి భయం చుట్టుకుంది. ఇక పార్టీలో ఉండి తప్పని పరిస్థితులలో మాత్రమే కొందరు ప్రచార కార్యక్రమాలకు వస్తున్నారే తప్ప ఎవరు కూడా మనస్పూర్తిగా ఈ ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడం లేదని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -