Purandeshwari: జీవీఎల్ కు షాకిచ్చిన పురంధేశ్వరి.. ఇది మామూలు ప్లాన్ కాదంటూ?

Purandeshwari: దగ్గుబాటి పురందేశ్వరి ఇదివరకు కాంగ్రెస్ లో కొనసాగుతూ కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఆమె 2014 ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీ నుంచి బిజెపిలోకి వచ్చారు. ఇలా బిజెపిలోకి వచ్చినటువంటి ఈమె రాజంపేట నుంచి పోటీకి దిగారు. అయితే గత ఎన్నికలలో ఓడిపోయినటువంటి ఈమె 2019 నాటికి ఆమెకు విశాఖ సీటు బీజేపీ ఇచ్చింది. పొత్తులు లేకపోవడం వల్ల ఆమెకు డిపాజిట్ దక్కలేదు.

ఇకపోతే విశాఖ ఎంపీ సీటు విషయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయని తెలుస్తుంది. విశాఖలో రెండేళ్ళ క్రితం సొంత ఇల్లు కొనుక్కుని ఇక్కడే తన రాజకీయం అని చెబుతూ వచ్చిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు ఇపుడు విశాఖ ఎంపీ సీటు అందని ద్రాక్ష లాగా మారిపోయింది. ప్రస్తుతం బిజెపి పరిస్థితులు చూస్తుంటే విశాఖ ఎంపీ సీటు నరసింహారావుకి కాకుండా పురందేశ్వరికి కట్టబెట్టి ఆలోచనలో హై కమాండ్ ఉన్నట్టు తెలుస్తుంది.

 

పురంధేశ్వరికి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పోస్ట్ ని కేంద్ర పార్టీ ఇచ్చింది. ఇక ఆమె బాస్ గా మారిపోయారు. ఇలా ఈమె బీజేపీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు వ్యవహరిస్తూ తాను కోరుకున్న చోట ఎన్నికలలో నిలబడకపోతే తానుకున్న పదవికి ఏమాత్రం వాల్యూ ఉండదని తెలుస్తుంది. అలాగే ఈమె అడిగిన చోట ఓకే చెప్పడానికి పెద్దలు కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

 

ఈ విధంగా పురందేశ్వరి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉండగా నరసింహారావు ఆశలు మొత్తం ఆడి ఆశలుగా మారిపోయాయని తెలుస్తుంది. కానీ ఆయన అనుచరులు మాత్రం ఈ విషయంపై స్పందిస్తూ కేంద్ర పెద్దల వద్ద జీవీఎల్ ని పరపతి ఉందని ఆయనే పోటీ చేస్తారని చెప్పుకొస్తున్నారు మరి విశాఖ విషయంలో ఎవరు లబ్ధి పొందుతారో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -