Purandeswari: పురంధేశ్వరి టార్గెట్ గా మరో కుట్ర చేస్తున్న వైసీపీ.. ఆమె ఏం పాపం చేసింది?

Purandeswari: వైసీపీకి ఎవరు ప్రమాదంగా మారుతున్నారని అనిపించినా వారిపై కుట్రలకు తెరలేపుతారు. ఇప్పుడు జగన్ మెయిన్ ఫోకస్ పురందేశ్వరిపై పడింది. ఈ మధ్య కాలంలో ఆమె వైసీపీపై ఒంటికాలపై లేస్తున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నపుడు పురందేశ్వరి చొరవ చూపించింది. కేంద్రం పెద్దలతో ఆమె మంతనాలు జరపడం వలనే చంద్రబాబుకి బెయిల్ వచ్చిందని సర్వత్రా టాక్ నడుస్తోంది. చంద్రబాబు జైల్లోనే ఉంటే.. ఈ ఎన్నికల్లో ఈజీగా గెలిచేవాళ్లమని వైసీపీ లెక్క. కానీ.. పురందేశ్వరి చొరవ కారణంగారే చంద్రబాబుకి బెయిల్ వచ్చిందని వైసీపీ కూడా నమ్ముతోంది. అందుకే ఇప్పుడు గెలుపు కోసం జగన్ ఎదరీదాల్సి వస్తోంది. ఈ పరిస్థితికి కారణమైన పురందేశ్వరిపై నిత్యం ఏవో ఒక ఆరోపణలు చేస్తున్నారు.

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆమె చెప్పినట్టు వైసీపీ ప్రచారం చేస్తోంది. వైఎస్ ప్రభుత్వం ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తే.. పురందేశ్వరి ఆ రిజర్వేషన్లను తొలగించడానికి కుట్ర చేస్తున్నారని ఆమెపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వైసీపీ బాగా వైరల్ చేస్తోంది. అలా వైరల్ చేస్తూ ముస్లింలు ఎవరూ టీడీపీ కూటమికి ఓటు వేయొద్దని ప్రచారం చేస్తున్నారు. టీడీపీ కూటమి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు అవుతాయని అబద్దపు ప్రచారం చేస్తున్నారు.

వైసీపీపై పురందేశ్వరి ఈ మధ్య దూకుడు పెంచారు. ఏపీలోని లిక్కర్ మైనింగ్, ల్యాండ్ మైనింగ్ అవినీతిపై ఆమె కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. దొంగ ఓట్ల వ్యవహారంలో కూడా ఆమె వైసీపీపై పోరాటం చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో జరిగిన దొంగ ఓట్ల వ్యవహారాన్ని ఆమె సీరియస్ గా తీసుకోని ఈసీకి ఫిర్యాదు చేయడంతో.. పలువురు అధికారులపై వేటు పడింది. అందుకే ఆమెపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇటీవల విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ వ్యవహారంతో కూడా ఆమెకు సంబంధం ఉందని వైసీపీ ప్రచారం చేసింది. వైసీపీ నేతలు బాహటంగానే ఆ ఆరోపణలు చేశారు. దీంతో.. ఆమె అలా మాట్లాడిన వారికి పరువు నష్టం నోటీసులు ఇచ్చారు.

ఆమె ఎంపీగా రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఆమెను ఓడించడానికి తప్పుడు వార్తలను క్రియేట్ చేసి వైసీపీ వైరల్ చేస్తోంది. ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు. ఇలా అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నవారిపై కఠినచర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే, ముస్లిం రిజర్వేషన్లు ఎన్నికల టైంలోనే గుర్తు వస్తాయా? అని బీజేపీ ఏపీ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు షేక్‌ బాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం రిజర్వేషన్ల గురించి తప్పుడు వార్తాలు ప్రసారం చేస్తే ఈసీకి ఫిర్యాదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -