Puri Jagannadh – Charmmy Kaur: ఏఫైర్ ఉంటే ఎక్కువ రోజులు ఉండదు!

Puri Jagannadh – Charmmy Kaur: టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి మనందరికీ తెలిసిందే. అభిమానులు అన్ని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి ఎంతోమంది ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్రణ వేసుకున్నాడు పూరి జగన్నాథ్. ఇక ఇది ఇలా ఉంటే హీరోయిన్ ఛార్మి,పూరి జగన్నాథ్ లపై ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. వీరిద్దరి మధ్య ఉన్న సాహిత్యాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుని ఏదో ఉంది అంటూ ప్రచారాలు చేశారు.

అయితే మరోవైపు పూరి జగన్నాథ్ తో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగానే ఛార్మి ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా పూరి జగన్నాథ్ ఛార్మితో తనకున్న రిలేషన్షిప్ గురించి బయట పెట్టేశారు. పూరి జగన్నాథ్ చార్మి కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా లైగర్. ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానున్న విషయం మనందరికీ తెలిసిందే. కాగా ప్రస్తుతం లైగర్ చిత్రబృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ..ఛార్మీ చాలా చిన్న వయస్సులో ఉన్నప్పటి నుంచి ఆమె నాకు బాగా తెలుసు. కొన్ని ఏళ్ల నుంచి ఛార్మితో కలిసి పని చేస్తున్నాను. ఛార్మీకి నాకు ఏదో అఫైర్‌ ఉందని ఏదేదో మాట్లాడుకుంటారు. ఆమె ఇంకా యంగ్‌ గా ఉండటం వల్లే ఇలాంటి రూమర్స్‌ వస్తున్నాయి. అదే ఛార్మికి 50 ఏళ్లు ఉంటే ఎవరూ ఇలా మాట్లాడేవారు కాదు. ఒకవేళ ఆమెకు వేరేవాళ్లతో పెళ్లి జరిగి ఉంటే కూడా మా మధ్య ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసే వాళ్లు కాదు. కానీ మేమిద్దరం ఒకే ఇండస్ట్రీలో కలిసి ఉండటం. ఎన్నో సంవత్సరాలుగా కలిసి ట్రావెల్ అవుతుండటంతో ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ నిజంగా అఫైర్‌ ఉన్నా అది ఎక్కువరోజులు నిలబడదు. ఆకర్షణ అనేది అశాశ్వతం. అది కొన్ని రోజూలోనే చచ్చిపోతుంది. స్నేహం మాత్రం శాశ్వతం. తామిద్దరం మంచి ఫ్రెండ్స్‌ అని తమపై వస్తున్న పుకార్లకు పూరి జగన్నాథ్ చెక్ పెట్టేసారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -