Pushpa 2: పుష్ప2 మూవీ బన్నీ నట విశ్వరూపం.. రష్మికకు కష్టమేనా?

Pushpa 2: స్ట్రైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో అల్లు అర్జున్ నటన, పాటలు, డ్యాన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఎర్రచందనం స్మగ్లర్ గా అల్లు అర్జున్ లుక్ కొత్తగా ఉంది. ఇందులో తగ్గేదేలే అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది. ఇక రష్మిక నటన, విలన్ గా సునీల్ యాక్టింగ్, సమంత హైటెం సాంగ్ ఈ సినిమాకు ప్లస్ గా మారాయని చెప్పవచ్చు. అల్లు అర్జున కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లను దక్కించుకుని బిగ్గెస్ట్ హిట్ సినిమాగా ఇది నిలిచింది. దాదాపు అన్ని భాషల్లోనూ ఈ సినిమా హిట్ అయింది.

అయితే పుష్ప-1కు కొనసాగింపుగా ప్రస్తుతం పుష్ప-2 వస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా సగం పూర్తయింది. ఈ క్రమంలో తాజాగా పుష్ప-2 గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప2లో రష్మిక పాత్ర ఉండదని, శ్రీవల్లి చినిపోతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే సెకండ్ పార్ట్ లో అల్లు అర్జున్ పాతర్ బలంగా ఉండబోతుందని, నెగిటివ్ షేడ్స్ లోనూ లాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బన్నీ క్యారెక్టర్ ఉంటుందని చెబుతున్నారు. అలాగే డైలాగ్స్ కూడా చాలా మీనింగ్ ఫుల్ గా ఉంటాయ. పుష్ప-2లో కేవలం బన్నీ క్యారెక్టర్ కోసమపే నలుగురు స్క్రిఫ్ట్ రైటర్స్ పనిచేస్తున్నారట.

 

ఇప్పటికే పుష్ప-2 నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. లుక్ చాలా కొత్తగా ఉండటంతో అల్లు అర్జున్ కు మంచి పేరు వస్తోంది. దీంతో సెకండ్ పార్ట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 2024 సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -