Tenali: ప్రియుడు ప్రియురాలి మధ్య గొడవ.. చివరికి?

Tenali: ఇటీవల కాలంలో చాలామంది ఊహించని విధంగా రెప్పపాటు కాలంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని దారుణాలకు ఒడిగడుతున్నారు. క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాల వల్ల చాలామంది కుటుంబాలు వీధిన పడుతుండగా మరికొందరి జీవితాలు అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి. కొంతమంది ఎదుటివారిపై దాడి చేయడం చంపడం ఒక ఎత్తు అయితే తమన తామే శిక్షించుకొని ఆత్మహత్య చేసుకోవడం మరొక ఎత్తు అని చెప్పవచ్చు. రెండు రకాల సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి.

 

తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తెనాలి మండలం కఠెవరం కాలువ కట్ట ప్రాంతంలో గద్దె రాము, తన్నీరు ఆమని ఇద్దరూ ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. భర్త నుంచి విడిపోయిన ఆమని, రాముతో కలిసి జీవిస్తోంది. అప్పటికే ఆమనికి ఒక బాబు, పాప కూడా ఉన్నారు. రాముకి ఇంకా పెళ్లి కాలేదు. రెండేళ్ల క్రితం కఠెవరం కాలువ కట్ట ప్రాంతంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. రాము కూలీ పనులకు వెళ్తుండగా, ఆమని ఇళ్లలో పని చేయడానికి వెళ్ళేది. అయితే కొంతకాలంగా వీరిద్దరీ మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

ఇక వారు గొడవ పడుతున్న ప్రతిసారి ఆమని తల్లిదండ్రులు సమీపంలోనే ఉండడంతో వారు వచ్చి ఇద్దరికీ తల్లి చెప్పేవాళ్ళు. ఇటీవల రాము పిన్నీ, కూతుళ్లు ఇంటికి రాగా ఆమని వారిపై గొడవ పడింది. అంతేకాకుండా వాళ్లు తన ఇంట్లో ఇంటే అందరినీ చంపేస్తానని బెదిరించింది. ఈ క్రమంలోనే ఇద్దరి మద్య మరోసారి గొడవ జరిగింది. ఆ గొడవ చిలికి చిలికి గాలి వానగా మారడంతో వెంటనే ఆమని కూరగాయలు కత్తి తీసుకుని రామ్మో గొంతు కోసేసింది. ఆ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రాము అక్కడిక్కడే మృతి చెందాడు. అర్థరాత్రి సమయంలో ఆమని పెద్దగా కేకలు వేస్తూ ఇంటి నుంచి బయటకు వచ్చి ముగ్గురు వ్యక్తులు తన ఇంటికి వచ్చి భర్త రాముని హత్య చేసి వెళ్లినట్టు ఏడ్చింది.

 

ఏమీ తెలియనట్టుగా నటిస్తూ కన్నీరు పెట్టడంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఘటనా స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరు, ఇంట్లో చిందరవందరగా పడి ఉన్న సామాన్లను పరిశీలించి ఇది హత్యే అని నిర్ణయించుకున్నారు. అలాగే హత్య జరిగిన సమయంలో ఆ ప్రాంతానికి కొత్త వ్యక్తులు ఎవరూ రాలేదని స్థానికులు చెప్పారు. దాంతో పోలీసులకు ఆమని పై ఉన్న అనుమానం నిజమైంది. వెంటనే పోలీసులు తమదైన శైలిలో ఆమనిని ప్రశ్నించడంతో అసలు నిజం చెప్పింది. పోలీసులు కత్తి స్వాధీనం చేసుకొని.. మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -