Raadhika: పిల్లలను కనడంపై రాధిక సంచలన వ్యాఖ్యలు

Raadhika: ప్రెజంట్ జనరేషన్ లో యువతి, యువకులు టేజనరేషన్ లోక్ ఇట్ ఈజీ పాలసీ ఫాలో అవుతున్నారు. ఏ విషయం అయినా చాలా లైట్ తీసుకుంటున్నారు. మరి ముఖ్యముగా పెళ్లి, పిల్లల విషయంలో అయితే పిచ్చా కూల్ అంటున్నారు. తెలిసి తెలియని వయసులో పెళ్లి చేసూకోవటం, విడిపోవడం సర్వ సాధారణం అయిపోయింది. అయితే మరి కొంతమంది అయితే మరింత బరితెగిస్తున్నారు. పెళ్లి కాకుండానే పిల్లలు కావాలి అనుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అందులోనూ ఇలా కోరుకునే వారిలో అమ్మాయిలు ఎక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

 

పిల్లలను కంటే తమ అందాలు పాడైపోతాయని సరోగసి, ఐవిఎఫ్ మార్గాలను ఎంచుకుంటున్నారు. సెలెబ్రిటీస్ తో పాటు సాధారణ అమ్మాయిలు కూడా ఇలాంటి మార్గాలు ఎంచుకోవడంపై వైద్య నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లపై సీనియర్ హీరోయిన్ రాధిక ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేసింది.

 

ప్రస్తుత యువతకు పెళ్లి అంటేనే పెద్ద సమస్యగా మారిందని..పెళ్లి లేకుండానే పిల్లల్ని కనొచ్చు అనే అభిప్రాయానికి వచ్చారని రాధిక తెలిపింది. పిల్లలు కావాలి అనుకుంటే సరోగసి , ఐవిఎఫ్ లాంటి ఎన్నో కొత్త పద్ధతులు ఉన్నాయి కదా వాదిస్తున్నారని చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనకుండా లైఫ్ ఎంజాయ్ చేయటానికి నేటి యువత అలవాటు పడ్తున్నారంది. లగ్జరీ లైఫ్ మోజులో పడి అమ్మాయిలు అమ్మతనాన్ని మిస్ అవుతున్నారంది.

 

ముఖ్యంగా కొంతమంది అమ్మాయిలు అయితే పిల్లల్ను కనడానికి మగవాళ్ళు అవసరమా అని ప్రశ్నిస్తున్నారని.. ఈ పద్ధతి మంచిది కాదని వెల్లడించింది. ఇది తప్పు పద్ధతి అని చెప్పిన ఎవరు వినడం లేదని.. అర్ధం కూడా చేస్కోవడం లేదని వాపోయింది. ప్రస్తుతం రాధిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కొందరు రాధిక మాటలను సమర్దిస్తుంటే.. మరికొంతమంది ఎవరి ఇష్టం వారిది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి రాధిక వ్యాఖ్యలపై మీరు ఏమంటారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -