Congress: ఒక్క కాంగ్రెస్ కు అరడజను ముఖ్యమంత్రులు.. ఈ పార్టీ పరిస్థితి ఇంత ఘోరమా?

Congress: మరి కొన్ని రోజులలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అన్ని పార్టీ నేతలు పదవుల కోసం ఆరాటపడుతున్నారు అలాగే ప్రజలలోకి వచ్చే తమను గెలిపించాలి అంటూ అభ్యర్థిస్తున్నారు. ఇలా ఎన్నికల సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు ప్రజలలోకి వెళ్తూనే మరోవైపు అధిష్టాన పెద్దలను కలుస్తూ పదవుల కోసం ఆరాటం కనబరుస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మట్టి కొట్టుకుపోయిన విషయం మనకు తెలిసిందే. ఇక తెలంగాణలో ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకుంటుందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కొందరు బిఆర్ఎస్ నాయకులు కూడా ఈ పార్టీ నుంచి వైదొలుగుతూ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు.

ఇలా తమ పార్టీ కచ్చితంగా వచ్చే ఎన్నికలలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు అనే విషయం గురించి కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారని ఎవరికి తోచినట్టు వారు నేనే ముఖ్య మంత్రి అంటూ ముఖ్యమంత్రి కుర్చీలో రుమాలు వేస్తూ సీటు ఖాయం చేసుకుంటున్నారని తెలుస్తుంది. మొదటినుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వారిలో రేవంత్ రెడ్డి ఒకరు.

ఈ సీటులో రేవంత్ రెడ్డి తో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి కూడా పోటీకి వస్తున్నారు. వీరితో పాటు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి, పొన్నం ప్రభాకర్, మధూ యాష్కీ వంటి అరడజను మంది ఈ రేసులో ఉన్నారు. అసలు వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు కానీ ముఖ్యమంత్రి పదవి కోసం ఇలా పోటీపడుతుండడం అందరిని ఓకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -