Raghunandan: రఘునందన్ సంచలన వ్యాఖ్యలు.. వాళ్లు పట్టించుకోవడం సాధ్యమేనా?

Raghunandan: తెలంగాణ బిజెపి శాసనసభ్యులు రఘునందన్ ఢిల్లీలోని మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తెలంగాణ బిజెపి పార్టీ కార్యకలాపాలను తనకు అప్పచెప్పాలంటూ డిమాండ్ చేశారు. తాను గత పది సంవత్సరాలుగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని నా కష్టాన్ని చూసి పార్టీ బాధ్యతలు తనకే ఇవ్వాలని రఘునందన్ తెలిపారు.

పార్టీ అధ్యక్షత పదవి లేదా ఫ్లోర్ లీడర్ పదవిలో ఏదో ఒకటి ఇవ్వాలని తెలిపారు. లేకపోతే జాతీయ అధికారి ప్రతినిధి పదవి ఇచ్చిన తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ఈయన తెలియజేశారు.గత పది సంవత్సరాలుగా పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని తెలిపారు దుబ్బాకలో తనని చూసి ఓట్లు వేసి గెలిపించాలని ఈయన తెలిపారు. వచ్చే ఎన్నికలలో కూడా తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

 

దుబ్బాక ఎన్నికలలో నాకు ఎవరు సహాయం చేయలేదని తానే గెలిచానని తెలిపారు. ఇక మునుగోడు ఉప ఎన్నికలలో భాగంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆ 100 కోట్లు నాకు కనక ఇచ్చు ఉంటే తెలంగాణలో దున్నేసే వాడిని అంటూ ఈయన కామెంట్ చేశారు. తెలంగాణలో పార్టీ అధ్యక్షత పదవి కోసం ఇప్పటికే పలువురు పోటీ పడుతున్న విషయం తెలిసిందే.

 

ఇందులో బండి సంజయ్ కూడా ముందు వరుసలో ఉన్నారు. అయితే బండి సంజయ్ కి కాకుండా ఇతరులకు పార్టీ అధ్యక్షత పదవి ఇవ్వబోతున్న మాట వాస్తవమేనని రఘునందన్ తెలిపారు. అయితే ఈ పార్టీ అధ్యక్షత పదవి తనకు రాదని తెలిసి బండి సంజయ్ మౌనం వహిస్తున్నారని,అధ్యక్షత పదవి కిషన్ రెడ్డి లేదా ఈటెలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే రఘునందన్ సైతం పార్టీ అధ్యక్షత పదవికి తాను కూడా అర్హుడు ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -