Raghurama: రఘురామకు టికెట్ రాకపోవడానికి జగన్ కారణమట.. ఆ వ్యక్తి ద్వారా జగన్ చక్రం తిప్పారా?

Raghurama: బీజేపీ ఫైనల్ జాబితా ఏపీలో పెద్ద ఎత్తున రచ్చ రాజేసింది. నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా బీజేపీ రఘురామకృష్ణం రాజుకు టికెట్ ఇస్తుందని అంతా భావించారు. అయితే సడెన్‌గా లిస్టులో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసవర్మ పేరు కనిపించింది. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా ఇదో సంచలనంగా మారిపోయింది. నరసాపురం నుంచి తిరిగి పోటీ చేస్తానన్న నమ్మకంతో కనిపించారు నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు. కూటమిలో ఏదో ఒక పార్టీ నుంచి పోటీలో ఉంటానన్న ధీమాతో స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చారు … నరసాపురం నుంచి తానే పోటీచేస్తున్నానని బహిరంగంగానే ప్రకటించారు. అదీ తాడేపల్లిగూడెంలో జరిగిన ప్రచార సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల సమక్షంలోనే ఆ ధీమా వ్యక్తం చేశారు

బీజేపీ, జనసేన, బీజేపీలో కూటమి కట్టడంలో ఆయన తనవంతు పాత్ర పోషించారు. నాలుగేళ్ల పైనుంచి వైసీపీ, జగన్‌కు చుక్కలు చూపిస్తూ వచ్చిన ఆయనకు బీజేపీ టికెట్‌పై ఆశలు అడియాశలయ్యాయి. జగన్ సర్కారును టార్గెట్ చేస్తూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను, కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ఏ రేంజ్‌లో ప్రోత్సహించారో.. ఎప్పుడెలా ఆకాశానికెత్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వాస్తవానికి వైసీపీలో రెబల్ అవతారమెత్తాక.. ఆయన నరసాపురంలోనే కాదు యావత్తు రాష్ట్రంలో పాపులర్ అయ్యారు. ఢిల్లీలో రచ్చబండ అంటూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన హడావుడి… ఆ క్రమంలో ఆయన అరెస్ట్ అవ్వడం… అరెస్ట్ సమయంలో తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించారని ఆయన కోర్టు కెక్కడం వంటి ఎపిసోడ్‌లతో ఆయన అందరి దృష్టినీ ఆకర్షించారు. అలా అందరికీ తెలిసిన నాయకుడ్ని కాదని.. బీజేపీ శ్రీనివాసవర్మకి నరసాపురం ఎంపీ టికెట్ ఇచ్చింది. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. టికెట్ దక్కకపోయినా.. ఆయన బీజేపీని తప్పు పట్టడం లేదు. లోక్‌సభలో తనపై అనర్హత వేటు వేయించలేకపోయిన వైసీపీ అధినేత జగన్‌నే తప్పుబడుతున్నారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో చక్రం తిప్పించి తనకు టికెట్ లేకుండా చేశారని ఆరపించారు.

మరి రఘురామకృష్ణం రాజు ఆరోపణల్లో ఎంత నిజం ఉంది అనేదానిపై ఓ సారి విశ్లేషిస్తే.. ఎంతో కొంత నిజం ఉండొచ్చనే అనుమానలు ఉన్నాయి. రఘురామకృష్ణం రాజుపై జగన్ వ్యక్తిగతంగా చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే .. జగన్ సర్కార్ పై మొదటి అసమ్మతి స్వరం వినిపించింది ఆయనే. రఘురామకృష్ణం రాజు స్వరం పెంచిన తర్వాత.. ఒక్కొక్కరు వాయిస్ పెంచారు. ఇప్పుడు వైసీపీపై ఇంత వ్యతిరేకత కనిపిస్తుందంటే దానికి బీజం వేసింది రఘురామకృష్ణంరాజు అనే చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి అలాంటి రఘురామకృష్ణంరాజు పతనాన్ని జగన్ సహజంగానే కోరుకుంటారు. ఏపీ బీజేపీలో జగన్ సన్నిహితులు ఉన్నారు. మాజీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జగన్‌కు చాలా సన్నిహితంగా ఉంటారు. అయితే, సోము ఒక్కరినే తప్పు పట్టడానికి లేదు. కేంద్ర బీజేపీ పెద్దలు కూడా జగన్ కు సన్నిహితంగానే ఉంటారు. టీడీపీతో పొత్తుపెట్టుున్న బీజేపీ… జగన్ ను విమర్శించడంలో ఆచీతూచీ అడుగులు వేస్తోంది. చిలకలూరుపేట సభలో మోడీ.. సీఎం జగన్ పేరు కూడా ఎత్తలేదు. వైసీపీపై పోరాటం చేస్తున్న కూటమి పార్టీ నేతలు జగన్ ను విమర్శించకపోతే ఎలా? అదే అనుమానం చాలా మందిలో ఉంది. అంటే కేంద్రపెద్దలతో జగన్ కు ఇంకా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలను వాడుకొని ఆయన రఘురామకృష్ణం రాజుకు టికెట్ రాకుండా చూశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -