Rajamouli: సాటిస్ఫై చేయకపోతే జక్కన్న ఊరుకోరా.. అలాంటి వ్యక్తా?

Rajamouli: టాలీవుడ్ పేరు దేశవ్యాప్తంగా కాదు, ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుకునేలా చేసిన డైరెక్టర్ రాజమౌళి. దర్శక ధీరుడిగా పేరుగాంచిన రాజమౌళి ఒక సినిమా చేస్తున్నాడు అంటే అది ఇంకా సెట్స్ మీదకు వెళ్లకముందే అనేక సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుంటుంది. ఒక సినిమాను ప్రేక్షకులు అందరూ మెచ్చేలా తీయడం రాజమౌళికి బాగా తెలిసిన విద్య.

 

‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రాజమౌళి.. ‘బాహుబలి’తో వేరే లెవల్ కు తీసుకెళ్లగా.. ‘ఆర్ఆర్ఆర్’తో ఏకంగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా చేయడానికి చాలా గ్యాప్ తీసుకునే రాజమౌళికి ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్ హీరోలకు సమానమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న రాజమౌళి.. భారీ ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నాడు.

అయితే రాజమౌళి విషయంలో ఒక నెగిటివ్ టాక్ కూడా ఉంది. గతంలో ఆయనతో కలిసి పని చేసిన ఎవరైనా రాజమౌళి గురించి ఈ విషయాన్ని తప్పకుండా అంగీకరిస్తారు. రాజమౌళి ఒక సీన్ తీస్తున్నాడంటే.. అది పూర్తిస్థాయిలో తనకు సంతృప్తికరంగా రావాలట. ఒకవేళ అది తాను అనుకున్నట్లు సంతృప్తికరంగా రాలేదంట మాత్రం ఎన్నిసార్లైనా ఆ షాట్ చేయడానికి రెడీ అవుతాడట.

ఎదుటి వ్యక్తి ఎంతటి స్టార్ హీరో అయినా కానీ రాజమౌళి మాత్రం సీన్ తాను అనుకున్న విధంగా వచ్చే వరకు రీటేక్ లు చేస్తూనే ఉంటాడట. ఈ విషయంలో అతడు సాటిస్ఫై అయ్యే దాకా వదలడని టాక్. తన సినిమా అన్ని రకాలుగా పర్ఫెక్ట్ గా ఉండాలనే కోరికలు రాజమౌళికి చాలా ఎక్కువ అని, ఒక రకంగా ఇదే ఆయన సక్సెస్ సీక్రెట్ అని రాజమౌళితో పని చేసిన వాళ్లంతా చెబుతారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -