Rajamouli: ఫ్యాన్స్ కు భారీ షాకివ్వబోతున్న రాజమౌళి.. ఏమైందంటే?

Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే అది ఓ రేంజ్ లో ఉంటుందని తెలుసు. జక్కన్నగా పిలుచుకునే రాజమౌళి ఏ సినిమా తీసిని అది భారీ హిట్ అవుతుంది. డబ్బులు కూడా కోట్లలో వస్తుంటాయి. ఆయన సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంటాయి. అంతే రీతిలో అవి వసూళ్లను కూడా రాబడుతుంటాయి. అందుకే రాజమౌళితో సినిమా తీయాలని నిర్మాతలు, హీరోలు పోటీపడుతుంటారు.

 

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ రేసులో కూడా రాజమౌళి నిలిచారు. అంతర్జాతీయంగా ఈ సినిమాకు మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఆ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. రాజమౌళి మహేష్ బాబును ఏ రేంజ్ లో చూపించనున్నాడోనని ఫ్యాన్స్ అందరూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా కొన్ని పనులు సాగుతూనే ఉన్నాయి. అయితే సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా కొంత టైమ్ పట్టే అవకాశం ఉంది.

 

తాజాగా రాజమౌళి, మహేష్ కాంబోలో వస్తున్న సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ వైరల్ అవుతోంది. తెలుగు ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ సినిమాలో సుకుమార్ అల్లు అర్జున్ ను డీ గ్లామరస్ గా చూపించారు. ఆ క్యారెక్టర్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. అయితే రాజమౌళి సినిమాలో కూడా మహేష్ బాబు కొంత సమయం పాటు క్రూరమైన గెటప్ లో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది.

 

మహేష్ బాబును తన సినిమాలో కొంత సమయం క్రూరమైన గెటప్ లో రాజమౌళి చూపించనున్నాడని తెలుస్తోంది. మహేష్ బాబు గెటప్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో ఫ్యాన్స్ కు రాజమౌళి భారీ షాక్ ఇవ్వబోతున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -