Rakesh-Sujatha: ఆ టార్చర్ వల్లే రాకేశ్ సుజాతల పెళ్లి జరిగిందా?

Rakesh-Sujatha: జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన రాకింగ్ రాకేష్, సుజాత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. న్యూస్ రీడర్ గా గుర్తింపు పొందిన సుజాత ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో లో అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలో రాకింగ్ రాకేష్ తో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. అయితే వీరిద్దరూ కేవలం స్కిట్స్ కోసం మాత్రమే అలా ప్రేమికులుగా నటిస్తున్నారని అందరూ భావించారు.

కానీ వీరిద్దరూ ఆన్ స్క్రీన్ మీద మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా ఒకరినొకరు ఇష్టపడి పెద్దల అంగీకారంతో ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రాకింగ్ రాకేష్, సుజాత వివాహ వేడుక ఇటీవల ఎంతో ఘనంగా జరిగింది. ఇదిలా ఉండగా సుజాత గురించి రాకింగ్ రాకేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి జరిగి ఆరు నెలలు కూడా పూర్తికాకుండానే తన భార్య గురించి రాకేష్ అసలు విషయం బయట పెట్టాడు.

 

సుజాత తనని ప్రేమించమని , పెళ్లి చేసుకోమని టార్చర్ చేసిందంటూ రాకేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు విషయం ఏమిటంటే.. వివాహం తర్వాత కూడా వీరిద్దరూ జబర్దస్త్ షోలో జంటగా స్కిట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్స్ ట్రా జబర్దస్త్ కోసం ఇటీవల రాకేష్ ఒక స్కిట్ చేశాడు. ఈ స్కిట్లో భాగంగా సుజాత తనని ప్రేమించమని టార్చర్ చేసిందంటూ చెప్పుకొచ్చాడు.
స్కిట్ లో రాకేశ్‌ను ఓ చెట్టుకు కట్టేసి ” ఎవరైతే తన మనసులో నిజాలు చెబుతారో అప్పుడు ఆ కాయ ఆటోమేటిక్‌గా చెట్టుకు తగులుకొని ఈ ఊరు చల్లగా ఉంటుంది అని రైజింగ్ రాజు చెబుతాడు.

 

ఆ తర్వాత ” నువ్వు పెళ్లి మనస్ఫూర్తిగా చేసుకున్నావా..” అని రైజింగ్ రాజు అడగ్గా “మాది ఒక పవిత్రమైన ప్రేమ..” అని రాకేశ్ చెబుతాడు. దీంతో చెట్టుకి ఉన్న కాయ కదలకపోవటంతో రాకేష్ అబద్ధం చెప్పాడని చితకొట్టేస్తారు. వెంటనే “బొంగులో లవ్ అండి.. ప్రేమించి.. పెళ్ళి చేసుకునేవారకు టార్చర్ పెట్టింది” అని రాకేశ్ గట్టిగా అరుస్తాడు. ఇది చెప్పిన వెంటనే కాయ పైకి వెళ్తుంది. అయితే రాకేశ్ చెప్పిన మాటలు విని సుజాత షాక్ అవుతుంది. అక్కడున్న వారు మాత్రం ఒక్కసారిగా నవ్వుతారు. అయితే ఇది స్కిట్ లో బాగంగా చేశారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -