Chiranjeevi: చిరంజీవి పక్కన హీరోయిన్ గా, చెల్లిగా, తల్లిగా నటించిన ఏకైక నటి ఎవరో తెలుసా?

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగినప్పటికీ హీరోయిన్లకు మాత్రం ఎక్కువ కాలం లైఫ్ స్పాన్ ఉండదు అని చెప్పాలి. కొంతకాలం పాటు హీరోయిన్లుగా కొనసాగిన అనంతరం అక్క పిన్ని వదిన పాత్రలకు వెళ్తారు. అలాగే తల్లి పాత్రలలో కూడా నటిస్తూ ఉంటారు. ఇలా హీరోయిన్లు ఒక హీరోతో ప్రియురాలిగా నటించిన తిరిగి ఆ హీరోకి వదిన పాత్రలలోనూ లేదా తల్లి పాత్రలలో కూడా నటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి పక్కన తల్లిగా చెల్లిగా ప్రియురాలిగా హీరోయిన్ నటించారు.

ఈ విధంగా చిరంజీవికి ప్రియురాలు తల్లి, చెల్లి పాత్రలో నటించిన నటి ఎవరు అనే విషయానికి వస్తే.. ఆమె మరెవరో కాదు సీనియర్ నటి సుజాత హిందీ తెలుగు తమిళ కన్నడ భాషలలో సుమారు మూడు వందలకు పైగా సినిమాలలో నటించినటువంటి సుజాత చిరంజీవి సినిమాలలో ఆయనకు ప్రియురాలిగాను నటించారు. అలాగే తల్లిగాను నటించారు, చెల్లిగాను నటించారు.

1980వ సంవత్సరంలో కృష్ణంరాజు చిరంజీవి కలిసి ప్రేమతరంగాలు అనే మల్టీ స్టార్లర్ సినిమాలో నటించారు. ఈ సినిమాలో చిరంజీవికి సుజాత ప్రియురాలిగా నటించారు. రెండేళ్ల తర్వాత ఈమె చిరంజీవికి సీతా దేవి చిత్రంలో చెల్లెలుగా నటించారు. ఇక 1995 వ ఈమె చిరంజీవికి బిగ్ బాస్ సినిమాలో తల్లిగా నటించారు. ఇలా చిరంజీవి సరసన మూడు విభిన్న పాత్రలలో నటించినటువంటి ఏకైక హీరోయిన్ ఈమె అని చెప్పాలి.

ఇలా ఈమె ఇన్ని పాత్రలలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగినప్పటికీ చిరంజీవి మాత్రం ఇప్పటికీ హీరో గానే నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నటువంటి చిరంజీవి ప్రస్తుతం తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన భోళా శంకర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -