Ram-Boyapati: రామ్ బోయపాటి మూవీ అలా ఉండనుందా?

Ram-Boyapati: మాస్ మూవీలతో పాటు, లవర్ బాయ్ గాను తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో రామ్ పోతినేని. ఇక ఫామిలీ సెంటిమెంట్, డ్రామా లతో పాటు.. కమర్షియల్ సినిమాలతోను మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే రామ్ పోతినేని, మహా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో సినిమా తీస్తున్నారు. ఇక ఈ సినిమాను ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.

బోయపాటి – రామ్ – పొలిటికల్ డ్రామా..?
పొలిటికల్ డ్రామాలతో సూపర్ డూపర్ హిట్స్ తీసాడు బోయపాటి. లెజెండ్, సరైనోడు.. మొదలైన మంచి పొలిటికల్ డ్రామా కథలతో మాస్ హిట్స్ అందించాడు. అయితే ఇప్పుడు ఇదే తరహా పొలిటికల్ డ్రామా కథతో రామ్ పోతినేనితో ఓ సినిమా చేయబోతున్నాడట బోయపాటి. ఇక ఈ కథ పూర్తిగా రాజకీయ నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇలాంటి కథాంశాలతో సినిమా రామ్ కి ఇదే మొదటిసారి.

సమకాలీన రాజకీయ అంశాలు ప్రతిబింబించేలా సినిమాను బోయపాటి ప్లాన్ చేస్తున్నారట. ఇక పొలిటికల్ పంచులు, విమర్శదాయకమైన పాత్రలతో సినిమా ఒక రేంజులో ఉంటుందట. ఇక ఈ సినిమాలో నందమూరి నటసింహం బాలకృష్ణ ఒక ప్రత్యేక పాత్రలో నటించనున్నారని జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇక దీనిపై ఇప్పటివరకు దర్శకులు బోయపాటి స్పందించలేదు.

ఈ సినిమాలో మరెన్నో ప్రత్యేకతలు ఉంటాయని తెలుస్తోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వ‌శి రౌటేలా స్పెషల్ సాంగ్ లో నటించనుంది. ఇక యాక్షన్ సన్నివేశాలకు పెద్దపీట వేసే బోయపాటి.. ఈ సినిమాలో కూడా భారీగా యాక్షన్ సీన్స్ ప్లాన్ చేస్తున్నాడు. రామ్ కెరీర్ లోనే ఇది అతి పెద్ద సినిమా అట. దాదాపుగా 100 కోట్లకు పైగా బడ్జెట్ కాగా.. రామ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ ఇది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -