Ram Charan: ఆ మూవీ విషయంలో చరణ్ జడ్జిమెంట్ ఫెయిలైందా?

Ram Charan: సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్లు ఓ హీరోను బేస్ చేసుకుని స్టోరీలు రాస్తారనే విషయం తెలిసిందే. డైరెక్టర్లు తమ ఇమ్యాజినేషన్‌లో ఓ హీరో కోసమే కథను సిద్ధం చేసుకుంటారు. స్టోరీ పూర్తి చేసుకుని వారి దగ్గరికి వెళ్తారు. ఆ హీరోకు స్టోరీ కూడా చెబుతారు. కానీ హీరో షెడ్యూల్ ఫుల్ బిజీగా ఉండటం, స్టోరీ నచ్చకపోవడం జరుగుతుంది. అప్పుడు డైరెక్టర్లు చేసేదేం లేక.. వేరే హీరోని వెతుక్కుంటారు. అప్పుడు వేరే హీరోతో సినిమా తీసి.. మంచి హిట్ అందుకుంటారు. ఇలాంటి కోణంలో తెరకెక్కిన చాలా సినిమాలు హిట్ అందుకున్నాయి. తాజాగా ఓ రూమర్ స్ప్రెడ్ అవుతోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ హిట్ సినిమాను చేతులారా వదులుకున్నాడని, ఆ సినిమాతోనే గ్లోబల్ స్టార్ ప్రభాస్ హిట్ కొట్టాడని ప్రచారం జరుగుతోంది.

 

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘చిరుత’ సినిమాతో రామ్ చరణ్ మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతో రామ్ చరణ్ పేరు ప్రఖ్యాతలు పెరిగాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా సూపర్ హిట్ అయింది. తాజాగా విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ ఎదిగాడు. అలా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును, క్రేజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాడు.

 

అయితే రామ్ చరణ్ అప్పట్లో ఓ సినిమా స్టోరీ విని రిజెక్ట్ చేశాడట. కానీ స్టోరీ నచ్చలేదని ఆ సినిమా నుంచి తప్పుకున్నాడట. ఆ స్టోరీపైనే ప్రభాస్ సినిమా చేశాడు. కే.కరుణాకరణ్ దర్శకత్వంలో వచ్చిన ‘డార్లింగ్’ సినిమాను మొదట్లో హీరోగా రామ్‌ చరణ్‌ను అనుకున్నారట. కానీ రామ్ చరణ్ కాదని చెప్పడంతో.. ప్రభాస్ ఆ సినిమా ఓకే చెప్పాడు. ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయింది. ప్రభాస్ కెరీర్‌లోనే బ్యూటిఫుల్ లవ్‌స్టోరీగా నిలిచింది. ఈ సినిమాతోనే ప్రభాస్ అభిమానులు ఆయనను ‘డార్లింగ్’ అని పిలవడం స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -