Ram Gopal Varma: ఆ కారణంతోనే విజయ్‌దేవరకొండను తొక్కేస్తున్నారు.. ఆర్‌జీవీ సంచలన కామెంట్‌

Ram Gopal Varma: ఎంత పెద్ద హీరో అయినా కొన్ని సినిమాలు ప్లాప్‌ అవుతూనే ఉంటాయి. అయితే ప్రస్తుతం సినీరంగంలో కొందరిని ఎదగనివ్వకుండా పెద్ద హీరోలు అడ్డుపడుతున్నారనే మాటలు చాలానే వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో విజయ్‌ దేవరకొండను కూడా సినీరంగంలో ఎదగనివ్వకుండా చేస్తున్నారనే మాటలు చాలానే వినబడుతున్నాయి. ఇటీవల విడుదలైన లైగర్‌ విషయంలో స్పష్టంగా కనిపించిందని పలువురు ఆరోపిస్తున్నారు. లైగర్‌ సినిమాపై నెగిటివ్‌ ప్రచారం చెయ్యడమే కొందరు పనిగా పెట్టుకున్నారని.. సినిమా విడుదల కాకముందే సోషల్‌ మీడియాలో విపరీతమైన దుష్ప్రచారం చేశారంటూ ఆ సినిమా డిస్టిబ్యూటర్‌ వరంగల్‌ శ్రీను ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

విజయ్‌ దేవకరకొండ ఎదుగుదలను చూడలేక కొందరు పెద్ద హీరోలు ఇలా చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ స్పందించి ఓ టీవీ ఛానల్‌ డిబేట్‌లో పాల్గొని పలు అంశాలపై ఆసక్తికర ప్రకటనలు చేశారు. విజయ్‌ దేవరకొండ చూపిన యాటిట్యూడ్‌ కూడా లైగర్‌ రిజల్ట్‌ పై ప్రతికూల ప్రభావం చూపిందన్న వాదన ఉంది. దీని గురించి వర్మ కొన్ని అంశాలు వెల్లడించాడు.

విజయ్‌ దేవరకొండకు యాటిట్యూడ్‌ అనేది లైగర్‌ చిత్రానికి మాత్రమే రాలేదు. అర్జున్‌ రెడ్డి మూవీకి ముందు నుండే అతడు అలా ఉన్నాడు. టాలీవుడ్‌ స్టార్స్‌ అయిన ఎన్టీఆర్, ప్రభాస్, రామ్‌ చరణ్‌ చాలా వినయంగా ఉంటారు. విజయ్‌ దేవరకొండ మాత్రం అగ్రెసివ్‌ గా ఉంటాడు. అదే అతన్ని స్టార్‌ చేసిందన్నాడు. లైగర్‌ సినిమా విషయంలో బ్యాడ్‌ లక్‌ అతన్ని వెంటాడింది. హిందీ ప్రేక్షకులు విజయ్‌ని ఓన్‌ చేసుకోలేకపోయారని వర్మ అన్నాడు. అలాగే విజయ్‌ ని పరిశ్రమలో తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం పైన కూడా వర్మ స్పందించారు.

ఎదుగుతున్న హీరోని తొక్కేయాలని చూడడం ఇండస్ట్రీలో మామూలైంది. ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతుందని ఒక హీరో ఎదుగుదలను మరో హీరో చూడలేకపోతున్నాడని అది మానవుని లక్షణం అన్నాడు. లైగర్‌ ఫలితం తర్వాత కూడా విజయ్‌ దేవరకొండ ఏం మారలేదు. అదే యాటిట్యూడ్‌ మైంటైన్‌ చేస్తున్నాడు. పరిస్థితులు అతనికి వ్యతిరేకంగా మారడంతో ఈ వాదనలు తెరపైకి వచ్చాయి. లైగర్‌ మూవీలో సరైన కంటెంట్‌ లేకపోవడం కారణంగా డిజాస్టర్‌ అయ్యింది. దాన్ని ఆసరాగా చేసుకొని యాంటీ ఫ్యాన్స్‌ యూట్యూబ్‌ లో వీడియోలు, సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ చేశారని వర్మ అభిప్రాయపడ్డారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -