Ram Gopal Varma: వైరల్ అవుతున్న రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్!

Ram Gopal Varma: పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి పది సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలోనే ఈయన 2019 వసంవత్సరంలో జరిగిన ఎన్నికలలో పోటీకి నిలబడి కేవలం తన పార్టీ తరఫున ఒకే ఒక్క స్థానంలో ఎమ్మెల్యేగా సీటు సంపాదించారు. పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. అయితే గతంలో కూడా ఈయన పలు పార్టీలతో పొత్తు పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే 2024 లో జరగబోయే ఎన్నికలలో అయినా పవన్ కళ్యాణ్ ఒంటరిగా ఎన్నికల బరిలో దిగబోతారని భావించిన ఈయన మాత్రం మరోసారి ఇతర పార్టీలతో పొత్తుకుదుర్చుకుంటున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ గత రెండు రోజుల క్రితం వరకు పొత్తు గురించి క్లారిటీ ఇవ్వకపోయినా చివరికి తాను పొత్తుకి సిద్ధమయ్యాను అంటూ క్లారిటీ ఇచ్చారు. జగన్ సర్కార్ ను గద్దె దింపడం కోసమే ఇతర పార్టీలతో పొత్తుకు సిద్ధమయ్యానని, సీఎం పదవి ఆశించి కాదు అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలియజేశారు.

 

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పొత్తు గురించి క్లారిటీ ఇవ్వడంతో ఈ వ్యాఖ్యలపై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ పొత్తు గురించి చేసినటువంటి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈ మాత్రం ఇతరులతో పొత్తు పెట్టుకోవడానికి మీకు మరొక పార్టీ, పిడికిలి ఎర్ర కండవాలు అవసరమా అంటూ భారీగా ట్రోల్ చేశారు. ఇలా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వర్మ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

పవన్ కళ్యాణ్ ఇలా ఉన్నఫలంగా తాను పొత్తుకు సిద్ధమేనని చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఇన్ని రోజులు పవన్ ముఖ్యమంత్రి అవుతారని, పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న జనసేన నాయకుల ఆశలపై పవన్ నీరు చల్లారని చెప్పాలి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ టిడిపితో పొత్తు కుదుర్చుకొని మరోసారి ఇతర పార్టీకి పల్లకి మోయానున్నారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -