Ramoji Rao: రామోజీరావు ఏ కేసులో అయినా స్టే తెచ్చుకోగలరు.. ఉండవల్లి సంచనల వ్యాఖ్యలు

Ramoji Rao: తెలుగు రాష్ట్రాల్లో రామోజీరావు పేరు అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు అందరికీ సుపరిచితమే. తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కూడా ఆయనకు సత్సంబంధాలు బాగానే ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో కూడా రామోజీరావుకు సాన్నిహిత్యం ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పార్టీ పెద్దలు స్వయంగా వెళ్లి రామోజీరావును కలుస్తారు. దీనిని బట్టి చూస్తే రామోజీరావుకు ఏ స్థాయిలో పలుకుబడి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన రాజకీయాల్లో లేకపోయినా.. రాజకీయాలకు ప్రభావితం చేయగలిగే వ్యక్తిగా ఆయన ఎదిగారు.

 

ఈనాడు పేరుతో రామోజీరావుకు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఛానెల్స్ ఉన్నాయి. అందుకే మీడియా అండ కోసం రామోజీరావును పార్టీల నేతలు కలుస్తూ ఉంటారు. అయితే రామోజీరావు, ఉండవల్లి అరుణ్ కుమార్ మధ్య ఎప్పటినుంచో మార్గదర్శి చిట్ ఫండ్ కేసుకి సంబంధించి వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. మార్గదర్శి చిట్ ఫండ్ పేరుతో రామోజీరావు అక్రమాలకు పాల్పడ్డారని, మార్గదర్శి చిట్ ఫండ్ ద్వారా వచ్చిన డబ్బులను ఇతర వ్యాపారాలకు వాడుకోవడం చట్టవిరుద్దమని ఉండవల్లి గతంలో కోర్టులో కేసు వేశారు. రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్ ద్వారా వచ్చిన నిధులను ఇతర వ్యాపారాలకు వాడుకున్నారని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ వేశారు.

కానీ చాలా ఏళ్ల తర్వాత ఇటీవల ఉండవల్లి వేసిన కేసులో రామోజీరావుకు ఊరట లభించింది. ఈ క్రమంలో రామోజీరావుపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. రామోజీరావుపై కోర్టులో ఏ కేసు వేసినా నిలవదని, ఆయన స్టేలు తెచ్చుకుంటారంటూ ఆరోపించారు. రామోజీరావు లాంటి వ్యక్తితో ఎవరూ పెట్టుకోవడానికి సాహసించరని, ఆయన చట్టాలకు అతీతుడు కాదనే విషయం ప్రజలు తెలుుసుకోవాలని సూచించారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -