Ramoji Rao: మార్గదర్శి కేసులో సీబీఐ దూకుడు.. రామోజీ మైండ్ బ్లాంక్ అయ్యేలా?

Ramoji Rao: ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఎల్లో మీడియా వల్ల భారీ స్థాయిలో నష్టం కలుగుతున్న సంగతి తెలిసిందే. ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారం వల్ల జగన్ ఎన్నో మంచి పథకాలను అమలు చేస్తున్నా ప్రజల్లో నెగిటివిటీ ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. అయితే జగన్ ను ఇబ్బంది పెడుతున్న ఎల్లో మీడియా అధినేత రామోజీరావుకు భారీ షాక్ తగిలింది. మార్గదర్శి కేసులో రూ.793 కోట్ల విలువైన రామోజీ ఆస్తులను సీఐడీ అటాచ్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.


తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రామోజీరావును పెద్దగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు. రామోజీరావు తప్పులు చేసినా అనేక రాజకీయ పార్టీలు చూసీచూడనట్టుగా వ్యవహరించాయి. అయితే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఈ పరిస్థితి మారింది. రాజకీయ చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న రామోజీ రావుకు 86 సంవత్సరాల వయస్సులో మార్గదర్శి కేసు వల్ల మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ తగిలింది.

మేనేజింగ్ డైరెక్టర్ ఫోర్ మెన్ ఆడిటర్ లు కుట్రతో నేరానికి పాల్పడ్డారని సీఐడీ వెల్లడించడంతో పాటు రామోజీరావు 793 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. చిట్స్ ద్వారా వచ్చిన మొత్తాన్ని ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడంతో సీఐడీ ఈ ఆస్తులను అటాచ్ చేసింది. చిట్స్ కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా డబ్బును తిరిగి చెల్లించడంలో మార్గదర్శి ఫెయిలైనట్లు సీఐడీ అధికారులు చెబుతున్నారు.

రామోజీరావుకు రాబోయే రోజుల్లో మరిన్ని భారీ షాకులు అయితే తప్పవని చెప్పవచ్చు. హోమ్ శాఖ సీఐడీకి అనుమతులు ఇవ్వడంతో ఆస్తులు జప్తు చేసినట్టు బోగట్టా. రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం 1999 ప్రకారం హోంశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. కేంద్ర చిట్‌ ఫండ్‌ చట్టాన్ని అనుసరిస్తున్నట్లు ఆధారాలు చూపించడంలో మార్గదర్శి ఫెయిలైంది. సీఐడీ ఇప్పటికే మార్గదర్శి సంస్థల నుంచి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుందని సమాచారం.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -