Ramoji Rao: రామోజీరావుపై సీఐడీ కుట్ర మళ్లీ ఫెయిల్.. ముసలోడిని ఎందుకు హింసిస్తారంటూ?

Ramoji Rao: మార్గదర్శిలో తన షేర్ల వాటాను శైలజ పేరు మీదకి మార్చారని తనను బెదిరించి వాటా లాక్కున్నారంటూ గాదిరెడ్డి యూరిరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు ఏపీ సి ఐ డి రామోజీరావు, శైలజ కిరణ్ పై చీటింగ్ తదితర సెక్షన్ల కింద నమోదు చేసింది. ఆ కేసులో చైర్మన్ రామోజీరావుకి ఎండి శైలజ కిరణ్ కి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. సిఐడి కేసులో తదనంతర చర్యలు అన్నింటిపై హైకోర్టు స్టే ఇచ్చింది 8 వారాలపాటు చర్యలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. క్వాష్ పిటిషన్ పై కౌంటర్ వెయ్యాలని ప్రతివాదులు యూరిరెడ్డి, సిఐడి లకి ఆదేశాలు ఇచ్చింది.

తర్వాత విచారణను డిసెంబర్ 6 కి వాయిదా వేసింది.విచారణ సమయంలో సిఐడి కి ఏపీ హైకోర్టు ప్రశ్నలు వర్షం కురిపించింది. మీ పరిధిలో లేకున్నా కేసు ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించింది. పిటిషన్ల తరఫున బలమైన వాదనలు వినిపించడంతో హైకోర్టు తదనంతర చర్యలపై స్టే ఉత్తర్వులు ఇచ్చింది. మార్గదర్శి వ్యవస్థాపకులలో ఒకరైన జి. జగన్నాథ రెడ్డి కుమారుడు గాదిరెడ్డి యూరి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చైర్మన్ రామోజీరావు ఆయన కోడలు మార్గదర్శి చిట్ఫండ్ ఎండి శైలజ కిరణ్ లపై ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది.

సెక్షన్ 420,467 120-8, రెడ్ విత్ 34 ఐపిసి కింద కేసు నమోదు చేశారు. 2016 సంవత్సరం నాటికి తన పేరు మీద ఉన్న షేర్ల విలువ ఒక కోటి 58 లక్షల 69,600 రూపాయలు కాగా రామోజీరావు కేవలం 39 లక్షల 74 వేల యూనియన్ బ్యాంక్ చెక్ ఇచ్చారని ఫిర్యాదులో తెలిపారు. సంతకం పెట్టకపోయినా ఫోర్జరీ చేసి తన పేరుతో ఉన్న వాటాలను తమకు సంబంధించిన వారి పేరిట మార్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

1962లో మార్గదర్శి చిట్ఫండ్ పెట్టిన సమయంలో తన తండ్రి జగన్నాథ్ రెడ్డి 5000 రూపాయలు పెట్టుబడి పెట్టారని. అందుకుగాను మార్గదర్శిలో తండ్రి జగన్నాథ్ రెడ్డి పేరిట కొన్ని షేర్లు రామోజీరావు ఇచ్చారని చెప్పారు. తమ షేర్లు వేరే వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన లేకపోవడంతో రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చలేదని తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు యూరి రెడ్డి సిఐడిని ఆశ్రయించారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -