Rapolu Ananda Bashkar: మునుగోడు ఉపఎన్నిక వేళ బీజేపీకి షాక్.. టీఆర్ఎస్‌లోకి మాజీ ఎంపీ జంప్

Rapolu Ananda Bashkar: మునుగోడు ఉపఎన్నిక వేళ బీజేపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. నేతలు వరస పెట్టి పార్టీలు మార్చేస్తున్నారు. బీజేపీ నుంచి అధికార టీఆర్ఎస్ లోకి నేతలు చేరుతున్నాయి. మునుగోడు ఉపఎన్నికల వేళ నేతలు ఒక్కొక్కర పార్టీని వీడుతుండటం బీజేపీక మింగడుపడటం లేదు. ఇప్పటిక పలువురు నేతలు బీజేపీని వదిలి టీఆర్ఎస్ గూటికి చేరగా.. తాజాగా మాజీ ఎంపీ బీజేపీకి గుడ్ బై చెప్పానున్నారు. త్వరలోనే టీఆర్ఎస్ లో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు.

మాజీ రాజ్యసభ ఎంపీ, బీజేపీ నేత రాపోలు ఆనందభాస్కర్ బీజేపీకి గుడ్ బై చెప్పనున్నారు. తాజాగా ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో ఆయన భేటీ అయ్యారు. టీఆర్ఎస్ లో చేరడంపై కేసీఆర్ తో చర్చించారు. కేసీఆర్ ఓకే చెప్పడంతో బీజేపీకి రాజీనామా చేయాలని రాపోలు ఆనందభాస్కర్ నిర్ణయం తీసుుకున్నారు. త్వరలోనే టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోవాలని కేసీఆర్ తో భేటీ అనంతరం నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆలూరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరి విషయం తెలిసిందే. ఈ పరిణామంతో బీజేపీ నేతలు డీలా పడ్డారు. ఇంతకెమంది నేతలు బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరుతారనే అంశం కాషాయ వర్గాలను టెన్షన్ పుట్టిస్తోంది.

ఇప్పుడు వారి బాటలోనే మాజీ ఎంపీ రాపోలు ఆణందభాస్కర్ పార్టీ మారుతుండాన్ని బీజేపీ నేతలు నిర్ణయించుకోలేపోతున్నారు. చేనేత వర్గానికి చెందని రాపోలు ఆనందబాస్కర్.. చేనేత రంగంపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వేయడాన్ని కేసీఆర్ తో జరిగిన సమావేశంలో ఖండించారు. చేనేత రంగంపై జీఎస్టీ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తనకు నచ్చలేదని, అందుకే బీజేపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు కేసీఆర్ తో తెలిపారు. బీజేపీ ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. నేతన్నలకు కేంద్రంలోని బీజేపీ ప్రబుత్వం చేస్తనన అన్యాయం చూడలేకపోతున్నానని విమర్శించారు. జీఎస్టీ విధించడంపై తాను తీవ్ర అసంతృప్తితో ఉన్నానని, ఆ నిర్ణయాన్ని భరించలేకపోతున్నట్లు తెలిపారు.

చేనేత రంగానికి టీఆర్ఎస ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి అభవృద్దికి అనేక సంక్షేమ, అ భివృద్ది కార్యక్రమాలు అమలు చేస్తోందని రాపోలు అనందభాస్కర్ స్పష్టం చేశారు. చేనేతల కోసం తెలంగాణ ప్రబుత్వం అమలు చేస్తునన పథకాలు నచ్చడంతోనే టీఆర్ఎస్ లో చేరాలని నిర్నయించుకుననట్లు కేసీఆర్ తో ఆనందభాస్కర్ తెలిపారు. త్వరలో బీజేపీకి ఆనందభాస్కర్ రాజీనామా చేయనున్నారు. తన రాజీనామా లేఖలో జేనేత రంగంపై జీఎస్టీ అంశాన్ని పొందుపర్చనున్నారు.

అయితే మునుగోడు ఉపఎన్నిక క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో నేతల వలసలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. బీజేపీకి షాకిచ్చేలా టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్స్ కు తెరలేపింది. గతంలో టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేతలను తిరిగి తమ పార్టీలోకి తెచ్చుకుంటోంది. అలాగే ఆ పార్టీలోని కీలక వ్యక్తులను టీఆర్ఎస్ లోకి లాగేసుకుంటోంది. టీాఆర్ఎస్ నేతలను బీజేపీ లాక్కునేందుకు ప్రయత్నాలు సాగిస్తునన తరుణంలో.. రివర్స్ ఆకర్ష్ తో కాషాయదళానికి టీఆర్ఎస్ వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది. మునుగోడు ఈ ఉపఎన్నికలో గెలుపు కోసం ప్రయత్నం చేస్తోన్న బీజేపీ నేత ఆత్మస్థైర్యం దెబ్బతీశాల వలసలకు టీాఆర్ఎస్ తెరలేపింది. బీజేపీ మాత్రం ఇద్దరు, ముగ్గురు పార్టీ మారినంత మాత్రమే తమకు వచ్చే నష్టం ఏమీ లేదని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -