Rashmika: ఆ క్రేజీ ప్రాజెక్ట్ లో రష్మిక ఛాన్స్ పోగొట్టుకున్నారా?

Rashmika: కత్తిలాంటి కన్నడ భామ, అభిమానులు ముద్దుగా క్రష్మికగా పిలుచుకునే రష్మిక మందన్నా.. ప్రస్తుతం చిక్కుల్లో పడింది. పాపం టైమ్ బాగులేనట్టుంది, అందుకే అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి ఈ ముద్దుగుమ్మకు. అతి తక్కువ సమయంలో కన్నడ కంటే ఎక్కువ తెలుగు మరియు ఇతర ఇండస్ట్రీలలో మంచి పేరు తెచ్చుకున్న ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఇరకాటంలో పడింది.

 

పాన్ ఇండియా లెవెల్లో పేరు..
ఇక టాలీవుడ్ క్వీన్ గా మంచి పేరు తెచ్చుకున్న రష్మిక.. గత సంవత్సరం విడుదలైన పుష్ప మూవీతో ఎక్కడ లేని క్రేజ్ సంపాదించింది. ఇక ఈ సినిమాలో శ్రీవల్లి గా అద్భుతమైన అభినయంతో.. పాన్ ఇండియా స్థాయిలో పేరు గడించింది. పుష్ప తర్వాత భారీ స్థాయిలో ప్రాజెక్టులు ఈమె వద్దకు వచ్చి చేరాయి. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు కూడా రష్మిక చేతిలో ఉన్నాయంటే ఎంత పాపులర్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు.

 

ఇక ఇటీవల రష్మిక చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. కన్నడ దర్శకుడు, ఇటీవల కాంతారా మూవీతో సూపర్ సూపర్ హిట్టు కొట్టిన రిషబ్ శెట్టి తో వివాదం రష్మికకు మైనస్ గా మారింది. దీంతో నెటిజన్లు రష్మికను విపరీతంగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. కాంతారా మూవీ చూడడానికి టైమ్ లేదని రష్మిక అనడం అభిమానులతో పాటు, రిషబ్ ఆగ్రహానికి కారణం అయ్యింది.

 

ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ ఎదుర్కుంటున్న రష్మిక.. తన నోటి దురుసుతో బంగారం లాంటి అవకాశాలు కోల్పోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం తాను నటిస్తున్న పుష్ప 2 కోసం భారీగా డిమాండ్ చేసిందట రష్మిక. అయితే మరీ ఓవర్ గా డిమాండ్ చేస్తుండటంతో సుకుమార్ వేరే వాళ్ళ కోసం వెతుకుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చూడాలి ఈ విషయంలో ఏమి జరుగుతుందో.

Related Articles

ట్రేండింగ్

CM Jagan , YS Sharmila: పసుపు రంగును జగన్ సహించలేకపోతున్నారా.. నీచమైన కామెంట్ల వెనుక కారణాలివేనా?

CM Jagan , YS Sharmila: వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి అంటే ఆయన మాట తీరు ఆయన వ్యవహార శైలి ఎలా...
- Advertisement -
- Advertisement -