Rashmika Mandanna: కాంతార సినిమాని రష్మిక రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా?

Rashmika Mandanna: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసిన కాంతార సినిమా పేరు మారుమోగిపోతుంది. కన్నడ నటుడు రిషబ్ శెట్టి దర్శకత్వంలోనే ఆయన హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీ కన్నడ భాషలో విడుదలైంది ఇలా కన్నడ చిత్ర పరిశ్రమలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా వివిధ భాషలలో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి సరసన కన్నడ బ్యూటీ సంయుక్త గౌడ్ హీరోయిన్ గా నటించారు.

ఈ సినిమా ద్వారా నటి సంయుక్త గౌడ్ సైతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇకపోతే ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో ముందుగా నటించే అవకాశాన్ని రిషబ్ శెట్టి రష్మిక మందన్నకు కల్పించారట.ఈ సినిమా స్టోరీ మొత్తం విన్నటువంటి రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడం వల్ల ఈ సినిమాని రిజెక్ట్ చేశారట.

ఇక ఈ సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర డి గ్లామర్ రోల్ కావడంతో ఇదివరకే ఈమె పుష్ప సినిమాలో నటించడం వల్ల తిరిగి మరోసారి ఇలాంటి పాత్రలో నటిస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుందన్న ఉద్దేశంతో ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. కానీ ఈ సినిమాని రష్మిక రిజెక్ట్ చేయడానికి మరొక కారణం కూడా ఉందని ఇండస్ట్రీ టాక్.ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారని అలాగే సంయుక్త గౌడ్ కూడా ఈ సినిమా కోసం కేవలం 50 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నట్లు సమాచారం.

ఇక పాన్ ఇండియా స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మిక ప్రస్తుతం ఒక్కో సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. అలాంటిది ఈ సినిమాలో తక్కువ రెమ్యూనరేషన్ కావడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేసిందన్న వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా రష్మిక మాత్రం ఈ సినిమాను వదులుకొని బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా సినిమాని మిస్ చేసుకున్నారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -