Rashmika: రష్మికను మైమరిపించిన ఆ పాప.. ఎలాగైనా పాపను కలవాలంటూ రష్మిక మందన్న!

Rashmika: టాలీవుడ్ ప్రేక్షకులకు రష్మిక మందన్న గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతుంది. టాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కించుకున్న ఈ బ్యూటీ.. చాలా తక్కువ టైంలోనే అగ్రస్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇదే క్రమంలో ఇండియన్ క్రష్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది.

ఇక ఈ అమ్ముడు తన అందంతో ఎంతమంది అభిమానులను ఆకట్టుకుందో మనందరికీ తెలిసిందే. ఇక ఇటీవల వచ్చిన పుష్ప సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించి.. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇక పుష్ప సినిమాలో రష్మిక మందన్న ఆ సినిమాలో పాటలకు తగ్గట్టుగా తన అందంతో పర్ఫామెన్స్ తో ప్రేక్షకుల మతులు పోగొట్టింది.

ఇక మొన్నటి వరకు పుష్ప సినిమాలో పాటలు కూడా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో హడావిడి చేశాయి. ఇక ఇదే క్రమంలో తాజాగా పుష్ప సినిమాలోని సామీ సామి పాటకు 3 సంవత్సరాల స్కూలు పాప అదిరిపోయే రేంజ్ లో స్టెప్పులు వేసింది. స్కూల్ యూనిఫామ్ లో ఉన్న ఆ పాప మిగతా పిల్లలతో కలిసి స్టెప్పులు వేసింది. ఇక ఆ పాప వేసిన స్టెప్పులు ప్రస్తుతం రష్మికను మరిపించేలా ఉన్నాయి.

ఆకట్టుకునే ఎక్స్ప్రెషన్స్ తో ఆ పాప సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. ఇక ఈ వీడియోను ఒక వ్యక్తి రష్మికకు ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇక ఆ చిన్నారి డాన్స్ చూసిన రష్మిక మందన్న ఒక్కసారిగా ఫిదా అయిపోయింది. అంతేకాకుండా మేడ్ మై డే అంటూ ఈ క్యూట్ బేబీని కలవాలి ఎలాగో చెప్తారా అంటూ కామెంట్ల రూపంలో తెలియజేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ పాప చేసిన డాన్స్ వీడియో తెగ వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -