Rathika Rose: భగవంత్ కేసరి కోసం రతిక తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Rathika Rose: బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ అయిన రతిక రోజ్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఈమె అందంతో బిగ్ బాస్ లో వాళ్ళనే కాకుండా ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంది. ఈమె ఆట తీరు చూసి నాగార్జున సైతం ఆశ్చర్యపోయారు. కానీ మొదటి వారంలో ఉన్న ఆ ఎనర్జీ మిగిలిన వారాలలో తగ్గిపోతూ ఉండడంతో ఈమె ఫేక్ బాండింగ్ గురించి తెలిసి ప్రేక్షకులు సైతం ఈమని నాలుగో వారంలోనే ఎలిమినేట్ చేసేసారు.

కానీ మళ్ళీ తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో లోపలికి వస్తుందన్న సమాచారం మనకి అందింది. ఈ వారంలో తను రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నది. అయితే ఈ విషయం పక్కన పెడితే రతిక ఇటీవల విడుదలైన బాలయ్య బాబు సినిమా భగవంత్ కేసరిలో ఒక చిన్న పాత్రను పోషించింది. ఒక మినిస్టర్ గా ఇంగ్లీష్ మాట్లాడుతూ కనిపించిన రతికని చూసిన వెంటనే ప్రేక్షకులు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.

కనిపించేది ఐదు నిమిషాలే అయినా సరే ఈమె తీసుకున్న రెమ్యూనిరేషన్ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. కేవలం ఐదు నిమిషాలకే 5 లక్షలు తీసుకున్నదట ఈ భామ. కేవలం ఐదు నిమిషాలకే ఇంత తీసుకుంటే ఒక ఫుల్ లెన్త్ క్యారెక్టర్ పడితే మరి ఇంకెంత తీసుకుంటుందో. రతిక అందం హీరోయిన్లతో పోలిస్తే అంత తక్కువేమీ కాదు. ఈమెకి బిగ్ బాస్ లోకి రావడం మంచిదే అయిందేమో చాలా అవకాశాలు వస్తున్నాయి.

ఒకవేళ రీ యంట్రి ఇచ్చిన తర్వాత టాప్ ఫైవ్ లో ఉంటే ఇంకెన్ని అవకాశాలు వస్తాయో చూడాలి. ఇప్పటికే చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ వస్తున్న రతికకి పెద్ద పెద్ద ఛాన్సులు వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే బిగ్ బాస్ లో గెలిచిన ఎవరికీ కూడా కెరీర్ లో బిగ్ బాస్ షో అంతగా ఉపయోగపడినట్టే కనిపించలేదు. గతంలో గెలిచిన ఏ విన్నర్ కి కూడా బిగ్ బాస్ వల్ల ఉపయోగం లేదనే చెప్పాలి. మరి రితికకి ఈ బిగ్ బాస్ ఎంత లాగ సహాయపడుతుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -