Rathika Rose: బిగ్ బాస్ హౌస్ లోకి రతిక రీ ఎంట్రీ.. పోయిన దరిద్రాన్ని మళ్లీ తెలివిగా ఇంట్లోకి తెచ్చురుగా!

Rathika Rose:  బిగ్ బాస్ 7 తెలుగు ఉల్టా పుల్టా అంటూ నాగార్జున ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్లో మాత్రం షాకుల మీద షాకులు ట్విస్ట్ ల మీద ట్విస్టులు ఇస్తున్నారు. కేవలం 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం నుంచి ఐదుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన తర్వాత మరో ఐదుగురిన హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా పంపించారు.

ఇలా వైల్డ్ కార్డు ద్వారా ఐదుగురు కంటెస్టెంట్ లో హౌస్ లోకి వెళ్లగా గతవారం ముగ్గురు నామినేషన్ లో ఉన్నారు. వీరిలో నయనీ పావని ఆరవ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇలా హౌస్ నుంచి ఈమె ఎలిమినేట్ కావడంతో నాగార్జున కాంటెస్టెంట్లకు అలాగే ప్రేక్షకులకు కూడా మరొకటి ఇచ్చారు. గత మూడు వారాలుగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయినటువంటి దానిని శుభశ్రీ రతిక ఈ ముగ్గురిలో ఒకరిని హౌస్ లోకి పంపిస్తున్నానని తెలియజేశారు దీంతో అందరూ కూడా షాక్ అయ్యారు.

అయితే ఈ ముగ్గురిలో ఎవరు హౌస్ లోకి రావాలి అనే విషయాన్ని హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ ఎంపిక చేయాలని నాగార్జున మరొక ట్విస్ట్ ఇచ్చారు. ఇలా ఒక బ్యాలెట్ బాక్స్ తయారుచేసి ఎవరైతే హౌస్ లోకి రావాలనుకుంటున్నారనే వారి పేర్లను ఓటు రూపంలో ఆ బాక్స్ లోకి వేయమని చెప్పారు. దీంతో ప్రతి ఒక్కరు కూడా వారి అభిప్రాయాలను పేపర్ పై రాసి ఓటు వేశారు.

ఇలా ఓటింగ్ పూర్తి అయిన తర్వాత నాగార్జున మరోక ట్విస్ట్ ఇచ్చారు. ముగ్గురిలో ఒకరు హౌస్ లోకి రావాలంటే మీరు వేసినటువంటి ఓట్లలో ఎవరికైతే తక్కువ ఓట్లు వచ్చాయో వారే హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ బ్లాస్ట్ చేశారు దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఇక హౌస్ లో దామిని శుభశ్రీకి ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. రతిక వ్యవహార శైలి నచ్చకనే ఆమెను నాలాగ వారమే బయటకు పంపించారు. ఇక ఓటింగ్ పరంగా రతికకు చాలా తక్కువ ఓట్లు రావడంతో ఆమె తిరిగి ఇంట్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -