Pallavi Prashanth: రతిక వల్ల నాకు శని పట్టుకుంది.. పల్లవి ప్రశాంత్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Pallavi Prashanth: బిగ్ బాస్ లో రాజకీయాలు చూస్తుంటే బయట రాజకీయాల్లో ఏమాత్రం పసలేదనిపిస్తుంది. అంత రసవత్తరంగా కథని నడిపిస్తున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్. ప్రస్తుతం బిగ్ బాస్ సెవెన్ పల్లవి ప్రశాంత్, రతికల వల్ల జనాల్లో ఇంట్రెస్ట్ పెరిగింది. ఎందుకంటే వాళ్ళు హౌస్ లోకి ఎంటర్ అవుతూనే లవ్ ట్రాక్ నడిపి ఇప్పుడు అక్క అని పిలుస్తాను అని,అలాగే నామినేషన్ లో తనతో గొడవపడిన రతిక తనకి శని లాగా పట్టుకుందని చెప్పుకొచ్చాడు.

పల్లవి ప్రశాంత్ కామెంట్స్ కి నెటిజన్స్ అందరూ షాక్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ముగ్గురు ఎలిమినేట్ అవ్వగా 11 మంది మిగిలారు. ఇందులో ఆట సందీప్, శివాజీ,శోభా శెట్టి హౌస్ మేట్స్ కాగా మిగిలిన ఎనిమిది మంది కంటెస్టెంట్లుగా ఉన్నారు. కామన్ మెన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ రతికతో లవ్ ట్రాక్ నడిపిన విషయం తెలిసిందే. వీరిద్దరూ మొదటివారం లవ్ బర్డ్స్ లాగా తిరిగారు.

అలాగే మొదటివారం గెస్ట్ గా వచ్చిన నవీన్ పోలిశెట్టి మీ లేడీ లక్ ఎవరో వారికి బ్యాండ్ కట్టమన్నప్పుడు పల్లవి ప్రశాంత్ రతికాని సెలెక్ట్ చేసుకుని ఆమెకి బ్యాండ్ కట్టాడు. నవీన్ పోలిశెట్టి కారణం అడిగితే ఆమె హౌస్ లోకి అడుగు పెట్టిన వెంటనే నాతో బాగా మాట్లాడింది అంతే కాకుండా ఆమె కూడా రైతుబిడ్డ అన్నాడు ప్రశాంత్. అలాంటి ఆ ఇద్దరూ ఇప్పుడు ఉప్పు నిప్పుగా మారిపోయారు. సడన్ గా రతికా నామినేషన్స్ లో ప్రశాంత్ పై విరుచుకుపడింది.

సారీ చెప్పాడు కదా అని మాట్లాడుతుంటే ఏయ్ అని పిలుస్తున్నాడు అంటూ రతిక ఫైర్ అయింది. నేను ఎవరినైనా అలాగే పిలుస్తాను అని చెప్పిన ప్రశాంత్ ఇకపై నిన్ను అక్కా అని పిలుస్తాను పని అనటంతో అక్కడున్న అందరూ షాక్ అయ్యారు. నామినేషన్స్ తర్వాత కూడా మళ్లీ వాళ్ళిద్దరి మధ్య మళ్లీ పంచాయతీ కావడంతో రతిక నాకు లేడీలక్ కాదు. ఆ బ్యాండ్ కట్టిన దగ్గర నుంచి శని లాగా చుట్టుకుందని ప్రశాంత్ చెప్పటంతో కధ మరింత రసవత్తరంగా నడుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -