Ravi Teja: ఆ విషయంలో కకృతి వల్లే మాస్ మహారాజ్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయా?

Ravi Teja: టాలీవుడ్ ప్రేక్షకులకు మాస్ మహారాజ రవితేజ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తన సొంత కష్టం మీద టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపుతో ప్రస్తుతం వెలుగుతున్నాడు. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా ద్వారా రవితేజ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక టాలీవుడ్ లో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానం తన సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే గత కొంతకాలం గా రవితేజకు మంచి హిట్ సంపాదించి పెట్టిన సినిమానే లేదు. మొత్తం భారీ స్థాయిలో ఘోర పరాజయాన్ని పొందుతున్నాయని చెప్పవచ్చు. గత సంవత్సరం విడుదలైన క్రాక్ సినిమాతో రవితేజ హిట్లు పరంగా మరోసారి గుక్కతిప్పుకున్నాడు.

నిజానికి ఈ సినిమా రవితేజకు గతంలో ఉండే క్రేజ్ ను సంపాదించి పెట్టింది. ఇక క్రాక్ సినిమా విజయం సాధించిందో లేదో.. రవితేజ వరుస సినిమా అవకాశాలు అందుకున్నాడు. కానీ అవి అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇక ప్రస్తుతం రవితేజ డైరెక్టర్ త్రినాధరావు దర్శకత్వం వస్తున్న ధమాకా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా చేస్తుంది. ఇదిలా ఉంటే రవితేజకు క్రాక్ సినిమా తర్వాత వచ్చిన సినిమాలు ఏవీ సక్సెస్ కాలేదు. పూర్తిగా పరాజయ పాలవుతున్నాయి. ఇక సినిమాలు ఇలా ప్లాప్ అవడానికి కారణం.. రవితేజ పారితోషికానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ కథ, కథనం హీరోయిన్లను సెలెక్ట్ చేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టలేకపోతున్నాడని అర్థమవుతుంది.

ఇలా హీరోయిన్ల విషయాల్లో శ్రద్ధ పెట్టకపోవడం వల్లనే రవితేజ వరుస ప్లాప్ లను ఎదుర్కొంటున్నాడని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా సాగుతున్నాయి. మరి ధమాకా సినిమాతో రవితేజ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి. పెళ్లి సందడి హీరోయిన్ శ్రీ లీల అదృష్టం ఏమన్నా రవితేజకు తగులుతుందా అని కొందరు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -