Ali: అలీకి వైసీపీ కీలక పదవి ఇవ్వడం వెనుక అసలు కారణం ఇదేనా?

Ali: టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు, వైసీపీ నేత అలీకి ఎట్టకేలకు సీఎం వైఎస్ జగన్ కీలక పదవి ఇచ్చారు. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్‌గా అలీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలీకి రాజ్యసభ పదవి ఇస్తారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. గతంలో దాదాపు అలీకి రాజ్యసభ పదవి కన్ఫామ్ చేశారు. సతీసమేతంగా అలీ వెళ్లి సీఎం జగన్ ను తాడేపల్లిలో కలిశారు. రాజ్యసభ పదవి ఇస్తారని జగన్ హామీ ఇచ్చారంటూ మీడియాకు అలీ వెల్లడించారు. కానీ చివరి నిమిషంలో ఏమైందో ఏమై కానీ అలీకి రాజ్యసభ పదవి దక్కలేదు. దీంతో గత కొంతకాలంగా వైసీపీలో అలీ అసంతృప్తిగా ఉన్నారు.

అయితే అలీకి నామినేషన్ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. అలీకి వక్ప్ బోర్డ్ ఛైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. త్వరలోనే దానికి సంబంధించిన ఉత్తర్వులు ఇస్తారనే ప్రచారం కొద్దిరోజులుగా జరుగుతోంది. కానీ ఈ క్రమంలో జగ్న అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అలీకి వర్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవి కాకుండా ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజరీ పదవిని ఇచ్చారు. క్యాబినెట్ ర్యాంక్ కలిగిన ఈ పదవిలో రెండేళ్ల పాటు అలీ కొనసాగుతారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో అలీకి ఈ పదవి దక్కడం చర్చనీయాంశంగా మారింది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు చెక్ పెట్టడానికే అలీకి జగన్ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పదవి ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. పవన్ కు అత్యంత సన్నిహితుడిగా అలీకి మంచి పేరు ఉంది. అలీకి తన సినిమాల్లో తన పక్కన లేకపోతే తనకు ఏదో వెలితిగా కనిపిస్తుందంటూ పవన్ పలుమార్లు చెప్పగా.. పవన్ తనకు అత్యంత స్నేహితుడని, తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ అలీకి చాలాసార్లు తెలిపారు .పవన్ నటించిన చాలా సినిమాల్లోనూ అలీ నటించారు. దీంతో అలీ, పవన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉండటంతో.. రాజకీయంగా పవన్ కు చెక్ పెట్టేందుకు అలీకి జగన్ ఇప్పుడు కీలక పదవి ఇచ్చారని చెబుతున్నారు.

ఎలాంటి పదవి ఇవ్వకపోయినా నాలుగేళ్లుగా వైసీపీలోనే అలీ కొనసాగుతున్నారు. దీంతో వైసీపీనే నమ్ముకుని ఉన్నందున ఇప్పుడు అలీకి జగన్ పదవి ఇచ్చారు. అలీకి ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. త్వరలోనే జనసేనలో చేరడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి నుంచి ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా ఆయన జనసేన నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. గోదావరి జిల్లాలో జనసేనకు బలం పెరుగుతుండటంతో.. అలీ జనసేనలో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇక విశాఖలో జనసేన కార్యకర్తలపై దాడి, జనవాణి కార్యక్రమానికి అనుమతించకపోవడంతో పవన్ కల్యాణ్ ఫైర్ అవుతున్నారు. ఆ ఘటన తర్వాత వైసీపీపై మరింత దూకుడు పెంచారు. టీడీపీ, అధినేత చంద్రబాబుతో కలిసి పోరాటం చేసేందుకు సిద్దమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోవడం ఖాయమంగా కనిపిస్తోంది. అదే జరిగతే వచ్చే ఎన్నికల్లో వైపీపీ వ్యతిరేక పవనాలు వీచడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తోన్నారు. ఇలాంటి తరుణంలో పవన్ కు చెక్ పెట్టడానికి అలీని ఓ అస్త్రంగా జగన్ ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీ నుంచి వైసీపీకి అంత మద్దతు ఇచ్చేవాళ్లు ఎవరూ లేరు. అందుకే అన్ని రకాలుగా అలీని ఉపయోగించుకోవాలని జగన్ చూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -