CM YS Jagan Mohan Reddy: మూడు రాజధానుల బిల్లుపై వెనక్కి తగ్గిన జగన్ సర్కార్.. కారణాలు ఇవేనా?

CM YS Jagan Mohan Reddy:  ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఏపీ రాజకీయం మొత్తం మూడు రాజధానుల చుట్టే తిరుగతోంది. అమరావతి రైతులు అమరావతి టు అసరవెల్లి పాదయాత్రపై వైసీసీ సర్కార్ చేస్తున్న విమర్శలు, అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రభుత్వం ప్రవేశపెట్టునుందనే వ్యవహారం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఐదు రోజుల పాటు పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. 15వ తేదీ ప్రారంభమవ్వగా.. ఇప్పటికీ రెండు రోజుల సమావేశాలు ముగిశాయి.

అసెంబ్లీ సమావేశాలు ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలింది. ఈ మూడు రోజుల్లో అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెడతారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. కేవలం మూడు రాజధానుల బిల్లు కోసమే ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసిందనే చర్చ జరిగింది. మంత్రులు కూడా మూడు రాజధానుల బిల్లు తెస్తామని బహిరంగంగా ప్రకటనలు చేశారు. కానీ అసెంబ్లీ సమాశాలు మొదలై రెండు రోజులు పూర్తైనా ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లను తీసుకురాలేదు.

మూడు రాజధానులే తాము కట్టుబడి ఉన్నామని అసెంబ్లీ ప్రకటించిన జగన్.. అసెంబ్లీ పరిపాలన వికేంద్రీకరణపై జరిగిన చర్చలు పాల్గొని మాట్లాడారు. అమరావతి అంటే తనకు కోపం ఏం లేదని చెబుతూనే పరిపాలన వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. అమరావతి నిర్మాణానికి వేల కోట్ల రూపాయాల ఖర్చు అవుతుందని, ప్రస్తుతం ఆర్ధిక సమస్య వల్ల ప్రభుత్వానిక అంత స్తోమత లేదన్నారు. విశాఖపట్నం ఇప్పటికే అభివృద్ది చెందిన సిటీ కనుక తక్కువ ఖర్చుతో బాగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు.

మూడు రాజధానుల బిల్లుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీనిని బట్టి చూస్తే మూడు రాజధానుల బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆలోచన లేదని తెలుస్తోంది. బిల్లుపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు సమాచారం. మూడు రాజధానుల బిల్లుపై డ్రాప్ట్ కూడా రెడీ అయిందని, బిల్లు పెట్టడమే తరువాయి అని ప్రభుత్వ లీకులు ఇచ్చింది. అంతా రెడీ అయిపోయిందనుున్న తరుణంలో కేవలం చర్చ మాత్రమే అసెంబ్లీ జరిపి బిల్లును ప్రవేశపెట్టకపోవడంతో ప్రభుత్వం బిల్లుపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి.

సాంకేతికపరంగా, న్యాయపరంగా కూడా రాజధానిగా అమరావతికే అనుకూలంగా ఉంది. ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ప్రభుత్వానికి షాక్ తగిలింది. రాజధానిగా అమరావతిని మార్చే అధికారం లేదని కోర్టులు తెగేసి చెప్పాయి. అమరావతిని అభివృద్ది చేయాలని సూచించాయి. అత్యున్నత న్యాయస్థానం తీర్పుకు వ్యతిరేకంగా మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం పెడితే కోర్టు ఉల్లంఘన కిందకు వస్తుంది. సుప్రీం తీర్పును లెక్క చేయకుండా ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడతే రాజ్యాంగ సంక్షోభం వచ్చినట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం మూడు రాజధానులపై వెనక్కి తగ్గడం వెనుక కారణం ఇదేననే చర్చ జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -