Relationship: 50 ఏళ్లు దాటిన తర్వాత సెక్స్ పై ఆసక్తి పెరుగుతోందా?

Relationship: సాధారణంగా యుక్త వయసు నుంచి ఒక వయసు వచ్చేవరకు సెక్స్ కోరికలు కలగడం అన్నది సహజం. వయసు పెరిగే కొద్దీ చాలావరకు సెక్స్ కోరికలు తగ్గిపోతూ ఉంటాయి. మరి ముఖ్యంగా 50 ఏళ్ళు వయసు దాటిన వారికి చాలా వరకు సెక్స్ కు సంబంధించిన ఆలోచనలు తగ్గిపోతాయి. కొందరికి మాత్రం 50 ఏళ్లు దాటినా కూడా సెక్స్ పై కోరికలు ఉంటాయి. కానీ ఒక సర్వే ప్రకారం 50 ఏళ్లు దాటిన తర్వాత దంపతులకు ఎక్కువ శాతం మంది సెక్స్ ఆలోచనలు రాకపోవడంతో పాటు సెక్స్ లో కూడా తక్కువగా పాల్గొంటారు. ఒకవేళ 50 ఏళ్లు దాటిన దంపతులు నిజంగానే శృంగారంలో పాల్గొంటారా, ఒకవేళ పాల్గొంటే ఎన్ని రోజులకు ఒకసారి పాల్గొంటారు అన్న వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

ఒక సర్వే ప్రకారం 40 నుంచి 50 ఏళ్లు దాటిన దంపతులు పది రోజులకు ఒకసారి సెక్స్ లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇంకొంతమంది జంటలు పద్ధతుల కంటే తక్కువ సమయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అన్ని జంటల్లో కూడా ఇదే విధంగా ఉండదు. కొంతమంది శృంగారానికి పూర్తి దూరంగా ఉంటే మరి కొంతమంది ఆ వయసులో కూడా శృంగారాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. వయసు మీద పడే కొద్ది సెక్స్ చేయడం కంటే వారికి వివాహ నాణ్యత ముఖ్యమని అనుకుంటూ ఉంటారు. ఇక మహిళల్లో చాలామంది పీరియడ్స్ రావడం ఆగిపోయిన తర్వాత గర్భం దాల్చుతాము అన్న టెన్షన్ ఉండదు కాబట్టి ఆ సమయంలో కొందరు ఎక్కువగా సెక్స్ ని ఆస్వాదిస్తూ ఉంటారు. చాలావరకు 50 ఏళ్లు పైబడిన జంటలు వారికి ఎటువంటి సమస్యలు ఒత్తిడి లు ఉండవు కాబట్టి శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.

 

పిల్లలు పెద్దవారు అయ్యి వారి కాలం మీద నిలబడినప్పుడు వారి పిల్లలకు సంబంధించిన టెన్షన్,ఒత్తిడి ఉండదు కాబట్టి తరచుగా సెక్స్ ను ఆస్వాదించడం ప్రారంభిస్తారు. ఇంకొన్ని జంటలు అయితే 30 ఏళ్ల వయసు దాటేగానే సెక్స్ చేయడం ఆపేస్తూ ఉంటారు. ఇక ఆ వయసులో చాలామంది పురుషులు ఒత్తిడి, శక్తి లేకపోవడం సంఘర్షణ మొదలైన కారణాలవల్ల ఎక్కువ శాతం లైంగిక కోరికను కోల్పోతారు. అలాగే మహిళలు కూడా పీరియడ్స్ ముగిసే సమయానికి సెక్స్ పట్ల ఆసక్తిని కూడా కోల్పోతారు. అలాగే చాలా మంది వయస్సు పెరిగేకొద్దీ యోని పొడిని కూడా అనుభవిస్తారు. లైంగిక ఉత్సాహం కోల్పోవడానికి ఇది కూడా ప్రధాన కారణం.
మహిళలకు పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత గర్భం దాల్చుతారనే టెన్షన్ ఉండదు కాబట్టి కొందరు సెక్స్‌ను ఎక్కువగా ఆనందిస్తారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -