Renu Desai: రేణు దేశాయ్ అలా చేసేది రెండవ పెళ్లి గురించేనా!

Renu Desai: రేణు దేశాయ్.. ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేనిది. జేమ్స్ పండు సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన రేణు.. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన బద్రి సినిమాలో నటించింది. అప్పట్లో ఈ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. స్క్రీన్ పై వీరిద్దరి రొమాన్స్ ఒక రేంజ్ లో పండింది.

ఆ తర్వాత జానీ సినిమాలో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ లు జంటగా నటించి.. ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నారు. ఇక బద్రి సినిమా సమయం లో వీరిద్దరి ర్యాపో కాస్తా ప్రేమగా మారింది. అలా వీళ్ళిద్దరూ కొంతకాలం ప్రేమించుకుని తర్వాత పెళ్లి చేసుకున్నారు. గత కొంతకాలానికి వీరిద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు వచ్చాయో కానీ.. తరువాత వీరి దాంపత్య జీవితానికి పూర్తిగా విడాకులు ఇచ్చుకున్నారు.

వీరిద్దరూ విడిపోయినప్పటికీ.. తమ ఇద్దరి పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. పవన్ కళ్యాణ్ తనకు కుదిరినప్పుడల్లా.. తమ బిడ్డలతో గడిపి వస్తాడు. ఇక రేణు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా రేణు దేశాయ్ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్న పోస్టులు రెండవ పెళ్లి కోసమేనా అన్నట్లు.. అనుమానాలు రేపుతున్నాయి.

జీవితంలో అవసరం ఉన్నప్పుడు.. మన చేయి పట్టుకొని నడిపించే తోడు కావాలి అని రేణు దేశాయ్ తనకు సంబంధించిన వీడియో పంచుకుంది. మరో పోస్ట్ లో మీ సోల్ మేట్ ను వెతకడానికి ముందు మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోండి అని వెల్లడించింది. ఈ పోస్టులు గమనించిన నెటిజన్లు.. నిజంగా రేణు రెండో పెళ్లి కోసమే ఇలాంటి పోస్ట్లు షేర్ చేస్తుందా.. అని ఆలోచనలు వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -