Renu Desai: మరోసారి ఫైర్ అయిన రేణు దేశాయ్.. పవన్ ఫ్యాన్స్ ను అవమానిస్తూ?

Renu Desai: తెలుగు ప్రేక్షకులకు నటి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బద్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత 2012లో పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే. పవన్ నుంచి విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ ఒంటరిగానే నివసిస్తోంది. కాగా పవన్, రేణుదేశాయ్ కి అకిరా నందన్, ఆరాధ్య అనే కొడుకు కూతురు కూడా ఉన్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ అభిమానులపై విరుచుకుపడింది. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ట్వీట్స్ చేస్తూ ఆమె మండి పడింది. అసలేం జరిగిందంటే.. తాజాగా ఏప్రిల్ 8వ తేదీ అకిరా నందన్ పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులు నెటిజెన్స్ అకిరా నందనకు పుట్టినరోజు విషెస్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే కొందరు నెటిజన్స్ హద్దులు మీరే ప్రవర్తించారు. ఒక నెటిజన్.. మేడమ్. ఇది చాలా అన్యాయం. మా అకీరాను ఒక్కసారి అయినా చూపించండి. మా అన్న కొడుకును చూడాలని మాకు ఉంటుంది కదా… మీరు హైడ్ చేయకండి.

అప్పుడప్పుడు అయినా వీడియోస్‌లలో అకీరా బాబును చూపించండి అంటూ ఓ నెటిజన్‌ కామెంట్ చేశాడు. ఆ ట్వీట్ పై స్పందించిన రేణు దేశాయ్.. మీ అన్న కొడుకా? అకీరా నా కొడుకు.. మీరు ఒక తల్లికి పుట్టలేదా.. మీరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని నేను అర్థం చేసుకోగలను.. కానీ, కొంచెం మాట్లాడే పద్ధతి నేర్చుకోండి. చాలావరకు ఇలాంటి కామెంట్స్‌ను నేను డిలీట్‌ చేస్తూ వస్తున్నాను. కానీ కొందరు హద్దుదాటి చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. నా కొడుకు బర్త్‌డే రోజున ఇలాంటి కామెంట్స్‌ చదవడం బాధేస్తోంది. 11 ఏళ్లుగా నన్ను ఒక చెడ్డదానిలా, విలన్‌గా చూస్తున్నారు. ఇదంతా చూసిచూసి నేను విసిగిపోయానుఅంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది రేణు దేశాయ్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -