Reserve Bank Of India: విశాఖలో రిజర్వ్ బ్యాంక్.. వైసీపీ కొత్త డ్రామా వెనుక అసలు ప్లాన్, లెక్కలు ఇవేనా?

Reserve Bank Of India: అభివృద్ధి, సంక్షేమం చేసి ప్రజలను ఓట్లు అడగాలి. జీతాలు పెంచి ఉద్యోగులకు ఓట్లు అడగాలి. ఉపాధి కల్పించి నిరుద్యోగులను ఓట్లు అడగాలి. ఎవరి అవసరాన్ని బట్టి వారిని ఆదుకోవాలి. వారికి భరోసా కల్పించాలి. అప్పుడు ఓట్లు అడగాలి. కానీ, ఇన్ని పనులు తమ వలన కాదు.. అన్నింటికి ఒకటే మందు అన్నట్టు ఉంది వైసీపీ సర్కార్ తీరు. ఇన్ని పనులు చేసి మభ్యపెట్టి ప్రజలను ఓట్లు అడిగితే సరిపోతుంది కదా? అనుకున్నట్టు ఉన్నారు. అందుకే మరో నాటకానికి వైసీపీ ప్రభుత్వం తెరలేపింది.

ఐదేళ్లుగా జగన్ సర్కార్ ఒక్క పెద్ద నిర్ణయం తీసుకోలేదు. పేరుకు మూడు రాజధానులు అంటూ పెద్ద ప్రకటన చేసి.. రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేయడం తప్ప చేసిందేమీ లేదు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పుకోవడానికి ఒక్కటి అంటే ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదు. గత ప్రభుత్వం కట్టి సగంలో ఉన్న భవనాలను కూడా పూర్తి చేయలేదు. టీడీపీ హయాంలో అమరావతి రాజధానిగా ఉన్నపుడు రిజర్వ్ బ్యాంక్ కార్యాలయానికి, సిబ్బంది నివాసాలకు ప్రభుత్వం 11 ఎకరాల భూమి కేటాయించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ మూడు రాజధానులు అన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు. కానీ.. విశాఖలో రాజధాని నిర్మాణానికి పునాదులు కూడా పడలేదు. కోర్టులు, ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. రాజధానిని అంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి. అనుకోవచ్చు. కానీ.. నాబార్డు, ఆర్బీఐ వంటి సంస్థల కార్యాలయాల ఏర్పాటుకు ఏంటీ సమస్య? వాటికి ఇంత వరకూ ఎందుకు భూమి కేటాయించలేదు? విశాఖలో కాకపోతే.. తిరుపతి, కర్నూల్ లో అయినా నిర్మించాలి కదా? దీనికి ఎవరిపై ఆరోపణలు చేస్తారు?

కనీసం ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నా.. కేంద్రప్రభుత్వ భవనాల నిర్మాణాలను పూర్తి చేశామని చెప్పడానికి అయినా ఏదో ఒక పని చేయాలి కదా? రాజధాని విశాఖ అని చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలను మభ్య పెట్టడం తప్ప చేసిందేమీ లేదు? ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడేసరికి ఆగమేఘాల మీద విశాఖలో రిజర్వ్ బ్యాంక్ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు ప్రారంభించిననట్టు హడావుడి చేస్తున్నారు. విశాఖ జిల్లా కలెక్టర్ కు రాష్ట్ర ఆర్ధిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. రిజర్వ్ బ్యాంక్ కార్యాలయం ఏర్పాటుకు స్థలాన్ని చూడాలి అని చెప్పింది. అయితే, ఇంత ఆగమేఘాల మీద ఇప్పుడెందుకు చేస్తుంది అంటే.. వైసీపీ నేతలకు ఓ భయం పట్టుకుంది.

ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయిన వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండేలా తన వాయిస్ రాజ్యసభలో వినిపిస్తానని అన్నారు. దీంతో.. విశాఖ రాజధాని కథలు సముద్రంలో కలిసిపోయాయని ఉత్తరాంధ్ర వాసులు అనుకున్నారు. దీంతో.. ఆ డ్యామేజ్ ను గుర్తించిన వైసీపీ అధిష్టానం బొత్స సత్యనారాయణను రంగంలో దించింది. సుబ్బారెడ్డి వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని అన్నారు. కానీ, వైజాగ్ ప్రజలకు నమ్మకం కలగలేదు. దీంతో.. విశాఖలోనే రాజధాని ఉంటుందని నమ్మకాన్ని కలిగించడానికి రిజర్వ బ్యాంక్ కార్యాలయాన్ని కడుతున్నామని ప్రచారం చేస్తున్నారు. అయితే, ఇలాంటి డ్రామాలు అన్నీ చూసి ప్రజలు విసిగిపోయారు. కాబట్టి ఇలాంటి నాటకాలు ఇంకా చెల్లవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -