Revanth Reddy: ఆంధ్రా వాళ్ల ఓట్లు కావాలి కానీ వాళ్లను గౌరవించరా.. కేటీఆర్ పై రేవంత్ షాకింగ్ కామెంట్స్!

Revanth Reddy: చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో ఏపీలో మాత్రమే కాకుండా తెలంగాణలో కూడా ఎంతోమంది ఐటీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఐటీ ఉద్యోగులు రోడ్లపైకి రావడంతో శాంతిభద్రతలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిరసనలు తెలియజేయాలి అంటే వెళ్లి ఆంధ్రప్రదేశ్లో చేసుకోండి హైదరాబాదులో చేయడం భావ్యం కాదు.

ఇక్కడ నిరసనలు తెలియజేస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదు అంటూ ఆయన తన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు. అయితే కేటీఆర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితమైనటువంటి నాయకుడు కాదు ఆయన కేటీఆర్ కంటే ముందుగానే జాతీయస్థాయి రాజకీయాలలో చక్రం తిప్పిన వారని వెల్లడించారు.

ముఖ్యమంత్రిగా మూడుసార్లు ఎన్నికయి రాష్ట్రానికి సేవ అందించారు అలాంటి వ్యక్తిని జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా అరెస్టు చేస్తే ఆయన అరెస్టుకు సంఘీభావం తెలపాల్సింది పోయి ఇలా మాట్లాడటం సరికాదని వెల్లడించారు. అదేవిధంగా హైదరాబాదులో స్థిరపడినటువంటి ఆంధ్ర వారి ఓట్లు మీకు కావాలి వారు కట్టే పన్ను మీ ప్రభుత్వానికి కావాలి కానీ వారికి మాత్రం మీరు ఎలాంటి గౌరవం ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.

ఆంధ్రప్రదేశ్లో మీరు బీఆర్ఎస్ పార్టీని పెట్టుకుని రాజకీయాలు చేయవచ్చు కానీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ నిరసనలు చేయకూడదా అని ప్రశ్నించారు. ఇకపోతే కెసిఆర్ కేటీఆర్ ఒక విషయం పూర్తిగా మరిచిపోయినట్టు ఉన్నారు. హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అనే విషయాన్ని మీరు మర్చిపోయారు హైదరాబాద్ ఏమి మీ జాగీరు కాదు అంటూ కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -