BRS Party: గులాబీ పార్టీ ఆర్తనాదాలు.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని మళ్లీ ప్రూవ్ అయిందిగా!

BRS Party: రాజకీయ నాయకులు అంటేనే ఒక మాట మీద నిలబడే వ్యక్తిత్వం ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. ఇలా ఎంతో మంది రాజకీయ నాయకులు ఒక పార్టీలో కొనసాగుతూ ఉన్నప్పటికీ అధికారం ఎటువైపు ఉంటే అటువైపుకు వెళ్లడం సర్వసాధారణంగా జరిగే అంశమే ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలంగాణలో బి ఆర్ ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అవుతుండగా కాంగ్రెస్ మొత్తం కీలక నాయకులతో నిండిపోయింది. పెద్ద ఎత్తున బి.ఆర్.ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు మొదలవుతున్నాయి.

గతంలో ఏ విధంగా అయితే బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు వచ్చాయో ప్రస్తుతం అదేవిధంగా ఈ పార్టీని వదిలి వేరే పార్టీలోకి వెళ్లిపోతున్నారు. చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత కర్మ అని కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనే సామెత అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆ కర్మ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను వెంటాడుతుందని చెప్పాలి. తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అనంతరం కెసిఆర్ మొదట ముఖ్యమంత్రిగా ఎంపిక అయ్యారు.

అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం కోసం ఎంతోమంది ఉద్యమంలో పాల్గొని కష్టపడ్డారు కానీ కెసిఆర్ మాత్రం వారికి టికెట్లు ఇవ్వకుండా రాత్రికి రాత్రి పార్టీలోకి వచ్చి చేరినటువంటి వారికి పెద్ద పీట వేశారు. ఇలా గతంలో బిఆర్ఎస్ పార్టీలోకి ఏ విధంగా అయితే చేరికలు వచ్చాయో ఇప్పుడు అదే విధంగా ఈ పార్టీని వదిలి మరో పార్టీలోకి చేరటం గమనార్హం

ఈ విధంగా బిఆర్ఎస్ నేతలు అందరూ కూడా పార్టీని వదిలి వెళ్తున్నారు అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఇద్దరు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని తెలిపారు. ఎక్కడ లోపం వచ్చింది ఎందుకు నాయకులు పార్టీలు మారుతున్నారు అనే విషయాల గురించి వారికి వారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి తప్ప పార్టీ మారిన వారిపై సెటైర్లు వేయటం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమీ లేవని ఇలాగే వ్యవహరిస్తే లోక్ సభ ఎన్నికల తర్వాత పార్టీ తెలంగాణ ముఖచిత్రంలో కూడా మాయమయ్యే అవకాశాలు ఉంటాయని పలువురు కేటీఆర్ వ్యాఖ్యలపై విమర్శలు కురిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ బ్యాలెట్ నంబర్ ఖరారు.. ఓటర్లు సులువుగానే ఓటు వేయొచ్చుగా!

Pawan Kalyan:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఒక...
- Advertisement -
- Advertisement -