Chandrababu-Revanth: చంద్రబాబుకి మద్దతు ఇవ్వడంపై రేవంత్ స్పందన ఇదే…!

Chandrababu-Revanth: ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీల మధ్య ఎన్నికల పోటీ గట్టిగా కనిపిస్తుంది. ఏ పార్టీకి ఆ పార్టీలు వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళుతున్నాయి. అయితే మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ పోటీలో లేనందు వల్లే కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టిడిపి ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ కి షిఫ్ట్ అయింది. అయితే త్వరలో ఏపీలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడగగా ఆయన దీనిపై స్పందించారు.

 

చంద్రబాబు అంటే తనకి ఎప్పుడు వ్యక్తిగతంగా అభిమానం ఉంటుందని తనకి గురువుతో సమానం అని చెప్పుకొచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతోటి తనకి సంబంధం లేదని అన్నారు. తాను గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాడినే అయినా కూడా ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నానని… గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తాజాగా తెలంగాణలో కేసీఆర్ లు ప్రజల్లో బలమైన ముద్రవేశారని తాను కూడా అంతటి పనితీరు కనబరిచే విధంగా పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి తప్పట అడుగు వేసిన అది రాష్ట్రానికే చెడ్డ చేస్తుందని అన్నారు.

తనకి పక్కనున్న కర్ణాటక, తమిళనాడు ఎలాగో ఆంధ్రప్రదేశ్ కూడా అలాగేనని కేవలం పొరుగు రాష్ట్రంగా మాత్రమే చూస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారని వారు ఎన్నికల వ్యూహాలు, పోటీపైన నిర్ణయాలు తీసుకుంటారని దానిపైన తాను జోక్యం చేసుకోనని అన్నారు. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం వల్ల ఆ ప్రభావం తెలంగాణ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ప్రభావం కూడా ఆంధ్రప్రదేశ్ లో కనిపించి కాంగ్రెస్ కి మేలు చేకూరుస్తుందని భావిస్తున్నట్లుగా చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు అన్ని అక్కడి నాయకులు అదృష్టం మేరకే ఉంటాయని వాటితో తనకి ఎటువంటి సంబంధం ఉండదని తేల్చి చెప్పారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -