Revanth Reddy: ఉచిత విద్యుత్ గురించి రేవంత్ షాకింగ్ కామెంట్స్.. ఏం చెప్పారంటే?

Revanth Reddy: ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తాము చెప్పినదే కరెక్ట్ అని నిరూపించుకోవడం చేస్తుంటారు. ఇలా ఎన్నికల సమయంలో పలు రాజకీయ పార్టీలు ఇలాంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ గురించి మాట్లాడుతూ రైతులకు 24 గంటలు కాకుండా రోజుకు మూడు గంటలు కరెంటు వదిలితే చాలని కామెంట్ చేశారు.

 

రేవంత్ రెడ్డి ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఇదే అవకాశంగా భావించినటువంటి బీజేపీ ప్రభుత్వం ఆయన పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ కి రైతులంటే అంత చులకన అందుకే ఉచితంగా ఇస్తున్నటువంటి కరెంటును కేవలం 3 గంటల పాటు మాత్రమే ఇవ్వాలని కామెంట్ చేశారు అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అయితే రేవంత్ రెడ్డి గురించి ఇలాంటి ఆరోపణలు వస్తున్నటువంటి సమయంలో ఆయన ఈ ఆరోపణలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు అయితే ఇందులోకి కేసీఆర్ ని లాక్కొని రావడం గమనార్హం.

రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలలో ఎలాంటి తప్పులేదు అయితే ఆయన చెప్పిన విధానం సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయని చెప్పాలి. ఈ విషయంపై స్పందించినటువంటి రేవంత్ రెడ్డి రైతులకు ఉచిత కరెంటు అక్కర్లేదు అనలేదు. తను చెప్పాలనుకున్నది కరెంటు కంపెనీల దగ్గర అడ్డగోలు కమీషన్లు గుంజడానికి కేసీయార్ ఈ 24 గంటల కరెంటు అని ప్రచారం చేసుకుంటున్నాడు అని చెప్పడంతన ఉద్దేశమని తాను ఉద్దేశం కరెక్టే ఆయన చెప్పిన విధానం సరిగా లేకపోవడంతో ఈ వివాదం చుట్టుకుంది.

 

ఉచిత విద్యుత్‌పై మరోసారి చర్చ జరగడం మంచిదే అన్నారు. 2004 ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీనే ప్రకటించిందని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. ఉచిత కరెంట్ ఇవ్వడం కుదరదని టీడీపీతో చెప్పించింది కేసీఆరే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత కరెంట్ ఇస్తామంటే.. టీడీపీ నేత చంద్రబాబు విద్యుత్ వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలంటూ ఎద్దేవా చేసిన విషయం గుర్తు చేశారు. ఉచిత విద్యుత్ విషయం మరోసారి తెరపైకి రావడమే కాకుండా ఈ విషయంలో కేసీఆర్ ని లాగడంతో ఇది కాస్త సంచలనగా మారింది.

 

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -