Revanth Reddy: వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Revanth Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇంద్రవెల్లిలో జరిగిన ఈ సభలో మాట్లాడుతూ పౌరుషం గురించి చెప్పాలంటే కొమరం భీమ్ పేరుని ప్రస్తావించాల్సిందే అన్నారు. అదిలాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను మేము తీసుకుంటామని ఆ రోజే చెప్పామని, ఇప్పుడు ఆదిశగా అడుగులు ముందుకు సాగుతున్నాయని అందుకే అదిలాబాద్ ని దత్తత తీసుకుంటామని చెప్పారు. నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు.

 

వచ్చే పదిహేను రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. దాంతోపాటు 500 కు గ్యాస్ సిలిండర్ కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళకి 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పారు. ఇంకా కేసిఆర్ గురించి మాట్లాడుతూ ఆయన ఫామ్ హౌస్ కి సీఎం కావాల్సిందే తప్ప తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రి కాలేరు అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ పాపాలు భైరవుడంటూ విమర్శించారు.

రాష్ట్రంలోని నిరుద్యోగులకు, అమరవీరుల కుటుంబాలను, ఉద్యమకారులను, రైతులను, దళితులను, మహిళలను, కేసీఆర్ నిలువు దోపిడీ చేశారంటూ మండిపడ్డారు. ఎక్కడ ఫామ్ హౌస్ కట్టాలి, ఎలా డెవలప్ చేయాలి అని ఆలోచించారు తప్ప ప్రజల గురించి ఆలోచించ లేదని డైరెక్ట్ అటాక్ చేశారు రేవంత్ రెడ్డి. అలాగే ఆరు నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న ప్రతిపక్ష నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

 

నీ అయ్యా ఎవడ్రా పడగొట్టేటోడు.. పడగొడతార్రా.. ఎవర్రా కొట్టేది అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం. వాళ్లు లక్షల కోట్లు ఖర్చుపెట్టి కట్టిన కాళేశ్వరం కూలిపోయినట్లు ఈ ప్రభుత్వం కూలిపోతుందా అని నిలదీశారు. మూడు నెలలకు, 6 నెలలకు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఎవరైనా అంటే వాళ్ళ పళ్ళు రాలగొడతామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -