Ram Gopal Varma: వర్మ కంపెనీ నుంచి బిగ్ బాస్ హౌస్ కు మరో బ్యూటీ.. ఈసారి ఎవరంటే?

Ram Gopal Varma: తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ బిగ్ బాస్ షో ఇతర భాషల్లో కూడా ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే తెర శూల తో పోల్చుకుంటే తెలుగులో భారీగా క్రేజ్ ని ఏర్పరచుకుంది బిగ్ బాస్ షో. ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ప్రసారం అయిన షో కూడా ముగిసిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే మరొక వారం రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కాబోతుంది. అయితే ఈ బిగ్ బాస్ సీజన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని బిగ్ బాస్ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

గత కొద్దిరోజులుగా కంటెస్టెంట్ల విషయంలో అనేక రకాల కథనాలు వినిపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ యాంకర్ ఉదయభాను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ మొదట్లో వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి. కానీ ఆ తర్వాత ఆమె పారితోషకం అత్యధికంగా డిమాండ్ చేసింది అంటూ వార్తలు వినిపించాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ హౌస్ లో ఉదయభాను పాల్గొనడం చాలా కష్టమే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే త్వరలోనే ప్రారంభం కానున్న బిగ్ బాస్ హౌస్ లో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు సంబంధించిన బ్యూటీ కూడా పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఆ బ్యూటీ మరెవరో కాదు ఇనాయ సుల్తానా.

ఈ నటి గతంలో కూడా ఎన్నో సార్లు రామ్ గోపాల్ వర్మ తో కలిసి వేడుకల్లో పాల్గొంది. ఆయన తో కలిసి డాన్స్ చేసిన వీడియోలు మరియు వర్మ ఆమెతో చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సమయంలోనే చాలా మంది ఎవరు ఈ ఇనాయ సుల్తానా అంటూ నెట్ లో తెగ సెర్చ్ చేశారు. కాగా గతంలో వర్మ వల్ల గుర్తింపు దక్కించుకున్న అరియానా రెండు సార్లు బిగ్ బాస్ లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఏకంగా అరియానా వర్మ తో తాను చేసిన ఇంటర్వ్యూ వల్ల వచ్చిన గుర్తింపు తోనే బిగ్ బాస్ లో అవకాశం వచ్చిందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది అరియానా. అయితే మొత్తానికి బిగ్ బాస్ షోకు ముద్దుగుమ్మలను రామ్ గోపాల్ వర్మ అందిస్తున్నాడు. కాగా వచ్చే సీజన్ లో కూడా మరో ముద్దుగుమ్మ ను కూడా రామ్ గోపాల్ వర్మ కంపెనీ నుండే తీసుకునే అవకాశాలుఉ ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -