RGV: వైరల్ అవుతున్న ఆర్జీవీ సెటైర్లు.. చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయ్యేలా?

RGV: ప్ర‌ముఖ ఆర్థిక నిపుణుడిగా జీవీ రావు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ గురించి ఏపీ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం గురించి షాకింగ్ కామెంట్స్ చేయడంతో జీవీరావు పై ప్ర‌ముఖ సంచలన ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఓ రేంజ్‌లో ట్విట‌ర్ వేదిక‌గా సెటైర్స్ వేశారు. జీవీరావును క‌మెడియ‌న్‌గా చిత్రీక‌రిస్తూ వివిధ రూపాల్లో ఆయ‌న్ను ఆవిష్క‌రించారు ఆర్జీవి. ఈ నేపథ్యంలోనే
జీవీరావుకు ఆర్జీవీ చాలెంజ్ విసురుతూ క‌నీసం ప‌ది శాతం ద‌మ్మున్నా తాను నిర్వ‌హిస్తున్న డిబేట్‌కు రావాల‌ని జీవీరావును వర్మ కోరారు.

ఈ విషయంలోకి మధ్యలో చంద్రబాబును ఇన్వాల్వ్ చేస్తూ.. జూనియ‌ర్ ఎన్టీఆర్ అంత‌టి స్టార్‌ను చంద్ర‌బాబు చేస్తార‌ని జీవీరావు పై పంచ్‌లు విసిరారు. కాగా ఆర్జీవి తన ట్వీట్ లో ఈ విధంగా రాసుకొచ్చాడు. జీవీ రావు, నిన్ను ఫైనాన్సియల్ ఎక్స్పర్ట్ గా గౌరవిస్తున్న 40 ఇయర్స్‌కి నీ డాన్స్ టాలెంట్ తెలుసా? ఆయనకున్న ఫిలిం కాంటాక్ట్స్‌తో నిన్ను తార‌క్‌ర‌త్న‌ కన్నా పెద్ద స్టార్ చేస్తారు. హే జీవీరావు నీకున్న డాన్స్ టాలెంట్‌లో ప‌ది శాతం దమ్మున్నా #Nijam ఛానల్‌లో AP ఫైనాన్స్ సిట్యుయేషన్ గురించి మాట్లాడటానికి ఇంటర్వ్యూకి రా అంటూ సోషల్ మీడియాలో వరుసగా వేర్వేరు ట్వీట్లు చేశారు వర్మ.

 

ఈ క్రమంలోనే జీవీరావు డ్యాన్స్ చేస్తున్న‌ట్టు క్రియేట్ చేసిన వీడియో ఆక‌ట్టుకుంటోంది. టీడీపీ, ఆ పార్టీ అనుకూల మేధావులు, ఎల్లో మీడియాకు ఆర్జీవీ కొర‌క‌రాని కొయ్య‌గా మారారు. ఇకపోతే రాంగోపాల్ వర్మ విషయానికి వస్తే.. తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు రాంగోపాల్ వర్మ. సమాజంలో జరిగే విషయాల గురించి తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు.. సినిమాల గురించి మాత్రమే కాకుండా రాజకీయాల గురించి కూడా తనదైన శైలిలో కామెంట్ చేస్తూ లేనిపోని కాంట్రవర్సిలను కొని తెచ్చుకుంటూ ఉంటారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -