RGV: పడక సుఖంపై వర్మ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

RGV: క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి సినిమా ఇండస్ట్రీలో తరచూ వివాదాలు చూస్తూనే ఉంటాం. పలువురు హీరోయిన్లు సైతం క్యాస్టింగ్‌ కౌచ్‌పై ఈ మధ్య కాలంలో పలు ఇంటర్వ్యూల్లో చెబుతూ వస్తున్నారు. డైరెక్టర్‌ గదికి రమ్మన్నాడని, ప్రొడ్యూసర్‌ హోట్‌లకు ఒంటరిగా పిలిచాడంటూ కొందరు యువ నటీమణులు వాపోతుంటారు. మరికొందరు ఏకంగా కొందరి పేర్లు చెబుతూ సంచలనం సృష్టిస్తుంటారు.

తమ కోరిక తీరిస్తేనే సినిమాల్లో అవకాశాలు దొరుకుతాయని, లేదంటే కెరీర్‌ నాశనం చేస్తామంటూ కొందరు బెదిరించారని చాలా మంది చెబుతుంటారు. ఇలా కొందరు హీరోయిన్లు కూడా చెబుతుండడం ఆశ్చర్యం కలిగించే అంశం. అయితే, సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ కామనే అనే స్థాయికి పరిస్థితి చేరుకుంది. సెలబ్రిటీ నటులు, స్టార్‌ ప్రొడ్యూసర్లు, దర్శకులు ఇలాంటి కామెంట్స్‌ను అవాయిడ్‌ చేస్తున్నారని చెప్పొచ్చు.

ఇలాంటి కామెంట్స్‌ను పట్టించుకుంటే తాము సినిమాలు చేసుకోలేమని బాహాటంగానే కొందరు నిర్మాతలు చెబుతున్నారు. అయితే, ఇటీవల తన అందాలను ఆరబోస్తూ అటు సోషల్‌ మీడియాలోనూ, ఇటు సినిమాల్లోనూ బిజీగా ఉంటోంది నటి అప్సర రాణి. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో బోల్డ్‌గా నటించిన రెచ్చిపోయిన ఈ భామ.. ఇటీవల వరుస అవకాశాలతో చెలరేగిపోతోంది.

ఒంటరిగా రమ్మని అలా చేశాడు..
ఇటీవల క్యాస్టింగ్‌ కౌచ్‌పై అప్సర కూడా సంచలన కామెంట్స్‌ చేసింది. తాజాగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడుతూ.. కన్నడ ఇండస్ట్రీలో తను ఒక సినిమాలో ఆఫర్ వచ్చిందని తెలిపింది. దీనికి ఎగిరి గంతేశానని, తీరా డైరెక్టర్ ఒంటరిగా రూమ్ కి రమ్మనేసరికి షాక్‌కు గురయ్యానని చెప్పింది. మా నాన్నతో కూడా అక్కడికి వెళ్లానని, బెడ్ పై అతడు పడుకొని తన కోరిక తీరిస్తేనే ఆఫర్ ఇస్తానని చెప్పాడని వాపోయింది. దీంతో ఆఫర్‌ తనకు వద్దని చెప్పగానే, బలవంతం చేయబోయాడని చెప్పింది. అప్పుడే తన తండ్రి అక్కడికి వచ్చాడని, ఇద్దరం పారిపోయి వచ్చామని తెలిపింది. మరోవైపు తెలుగు ఇండస్ట్రీలో ఎన్నడూ ఇలా జరగలేదని అప్సర చెప్పింది. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ వైరల్‌ అయ్యాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -