Rohit Sharma: కెప్టెన్ గా రోహిత్ సూపర్ అంటోన్న టీమిండియా మాజీ క్రికెటర్

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు అనేక టోర్నమెంట్లలో విజయం సాధించలేకపోయారు. దీంతో టీమిండియా అనేక విమర్శలను ఎదుర్కొంది. కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఓడిపోయింది. 2019 వన్డే ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో పరాజయం పాలైంది. 2021 టీ20 ప్రపంచ కప్‌లో మొదటి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. ఆ సమయంలో అందరి చూపు కోహ్లీ నుంచి రోహిత్ శర్మపై పడింది.

 

రోహిత్ శర్మ అప్పటికే ముంబై ఇండయన్స్ జట్టుకు కెప్టెన్ గా ఉంటూ ఐదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిళ్లను గెలిచాడు. అందుకే రోహిత్ శర్మను విరాట్ తర్వాత కెప్టెన్ ను చేసింది. అయితే రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకోలేకపోయిన టీమిండియా ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ సెమీ-ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.

 

భారత మాజీ క్రికెటర్ అయిన మహ్మద్ కైఫ్ రోహిత్ శర్మ, కోహ్లి కెప్టెన్సీల గురించి తనదైన శైలిలో మాట్లాడారు. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రోహిత్ బాగా రాణిస్తున్నాడని, జట్టు కూడా కాస్త మెరుగుపడినట్లు కనిపిస్తోందని తెలిపాడు. అయితే ప్రపంచ కప్, ఆసియా కప్ వంటి పెద్ద టోర్నమెంట్లలో రోహిత్ విఫలమయ్యాడని కైఫ్ కూడా అంగీకరించాడు.

 

కెప్టెన్‌ అయినప్పటి నుంచి రోహిత్‌ అద్భుతంగా రాణిస్తున్నాడని, అయితే వయసు రీత్యా అతను పెద్దవాడని అన్నాడు. అతని నాయకత్వంలో భారత్ అన్ని టీమ్ లను ఓడించిందని తెలిపాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తుపల్లాలు అనేవి ఉంటాయని, రోహిత్ శర్మకు కూడా కాస్త సమయం ఇచ్చి చూడాలని కైఫ్ సూచించాడు. త్వరలో రోహిత్ నాయకత్వంలో టీమిండియా అనేక విజయాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ ఓవరాల్ రికార్డును పరిశీలిస్తే అతని ఆటతీరు చాలా బాగుందని మహ్మద్ కైఫ్ కొనియాడారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -