Sharmila: మరోసారి షర్మిలను కెలికిన రోజా.. విమర్శలు వేరే లెవెల్ అంటూ?

Sharmila: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైయస్ షర్మిల కాంగ్రెస్ తీర్పు పుచ్చుకున్న తర్వాత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ మరిచిపోయిన కాంగ్రెస్ పార్టీని అందరికీ గుర్తుచేస్తూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల నగరి పర్యటన చేసినటువంటి షర్మిల నగరి ఎమ్మెల్యే రోజా పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. నగరిలో భూకబ్జాలు భారీగా పెరిగిపోయాయని ఈమె నగరి ఎమ్మెల్యే పై చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇలా తన గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన షర్మిలకు రోజా కౌంటర్ ఇచ్చారు.

 

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఇప్పటికే బతికే ఉన్నారు ఆయన మరణించిన తర్వాత ఆయన కుటుంబాన్ని చీల్చి రాష్ట్రాన్ని చీల్చినటువంటి కాంగ్రెస్ పార్టీతో ఆయన బిడ్డ షర్మిల చేతులు కలిపారని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన పేరు ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అలాంటి పార్టీతో షర్మిల కలిసి తన అన్న పై విమర్శలు చేయడం సరికాదని తెలిపారు.

నేను రాజన్న బిడ్డని అని చెప్పుకోవడం తప్ప రాజన్న పేరు నిలబడేలా ఏ ఒక్క మంచి పని కూడా షర్మిల చేయలేదని ఈమె తెలిపారు. రాజన్న ఆశయ సాధనాల కోసం జగన్మోహన్ రెడ్డి ఎన్నో కష్టాలు పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఆయనని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొని పేదల కోసం నిలబడ్డారని అసలు సిసలైన రాజన్న బిడ్డ వైయస్ జగనన్న అంటూ షర్మిల తెలిపారు.

 

రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనాల కోసం జగన్మోహన్ రెడ్డి పని చేయగా షర్మిల ఆస్తుల కోసమే పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఇన్ని రోజులు తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి అక్కడ పాదయాత్ర చేసి నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను చచ్చేవరకు ఇక్కడే పోరాటం చేస్తానని మాట్లాడిన షర్మిల అక్కడ పార్టీని గాలికి వదిలేసి ఇప్పుడు ఏపీలో జగనన్న ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. షర్మిల చంద్రబాబు వదిలిన బాణం అని చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ ఎన్నికలలో ఓట్లు చీల్చడం కోసమే తన ప్రయత్నాలు చేస్తున్నారని ఈమె షర్మిలకు తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.

 

Related Articles

ట్రేండింగ్

Nara Lokesh-Murugudu Lavanya: మంగళగిరిలో సీన్ సితారే.. లోకేశ్ దెబ్బకు వైసీపీ లావణ్య సైలెంట్ అయ్యారా?

Nara Lokesh-Murugudu Lavanya: 2019 ఎన్నికలలో నారా లోకేష్ వైసీపీ నేత ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి చాలా తక్కువ ఓట్లు తేడాతో ఓడిపోయారు. అయితే...
- Advertisement -
- Advertisement -