Roja: దోచుకోవడంలో కలెక్షన్ కింగ్ చంద్రబాబు నాయుడు.. రోజా సంచలన వ్యాఖ్యలు వైరల్!

Roja: మంత్రి ఆర్ కె రోజా అటు చంద్రబాబు నాయుడు, లోకేష్ పై ఇటు పవన్ కళ్యాణ్ పై ఏకధాటిగా విమర్శలు గుప్పిస్తున్నారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏమీ చేయలేదు అంటూ ఆవేశంగా తన ఆక్రోసాన్ని వెళ్ళగక్కుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు.

ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి బ్రష్టు పట్టించారు. దోచుకోవటంలో కలెక్షన్ కింగ్ చంద్రబాబు నాయుడు. ఆయనకి ఐటీ నోటీసులు ఇస్తే ఎందుకు ఎవరూ నోరు మెదపడం లేదు. ఆయన ఇంట్లో శోధాలు చేస్తే దాదాపు 118 కోట్ల నల్లధనం దొరికిందన్న ఆమె టీడీపీ హాయంలో ఇచ్చిన కాంట్రాక్ట్ పనుల్లో దొంగ బినామీలు పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు లోకేష్ పై సిబిఐ విచారణ చేయించి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు.

అలాగే రజినీకాంత్ గురించి తానేమి తప్పుగా మాట్లాడలేదని, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వచ్చినప్పుడు ఆయన గురించి మాత్రమే మాట్లాడితే బాగుంటుందని మాత్రమే చెప్పానని, అయితే రజనీకాంత్ చంద్రబాబు నాయుడుకి ఓటు వేసి గెలిపించాలి అని చెప్పటంపై అభ్యంతరం లేవదీశాను. రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు మాత్రమే ఏపీని నెంబర్ వన్ స్థానానికి తీసుకువస్తారు అని చెప్పడాన్ని ఖండించాను అంటూ క్లారిటీ ఇచ్చారు మంత్రి రోజా.

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుకి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ఇల్లు లేవన్నారు. హైదరాబాద్ నుంచి అప్పుడప్పుడు వచ్చి వైసీపీ నాయకుల పై విమర్శలు చేసి వెళ్ళిపోతుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ తీసుకొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఊగిపోతూ మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ లపై విచారణ జరిపించి జైల్లో పెట్టించాలని డిమాండ్ చేశారు. వాళ్లతో పాటు పవన్ కళ్యాణ్ ని కూడా విచారించి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు రోజా.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -