Rupa Lakshmi: నేను స్పృహలో లేని టైమ్ లో అలా జరిగిందన్న రూపా లక్ష్మి.. ఏమైందంటే?

Rupa Lakshmi: బలగం సినిమాలో లచ్చవ్వ పాత్ర ద్వారా మంచి గుర్తింపు పొందిన నటి రూప లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బలగం సినిమా కన్నా ముందు ఎన్నో సినిమాలలో, సీరియల్స్ లో నటించిన రూప లక్ష్మికి రాని గుర్తింపు బలగం సినిమాలోని లచ్చవ్వ పాత్ర ద్వారా వచ్చింది. ఈ క్రమంలో ఆమె వరుస ఇంటర్వ్యులలో పాల్గొంటూ తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలో ఇండస్ట్రీలో అందరి మహిళల లాగే తాను కూడా కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపింది.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో మహిళలు క్యాస్టింగ్ కౌచ్ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బలగం నటి రూపా లక్ష్మి కూడా క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బందులు పడినట్లు వెల్లడించింది. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న రుపా లక్ష్మి మాట్లాడుతూ..” చిన్నతనంలోనే తాను ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. ఎవరో ఒక వ్యక్తి అవకాశం ఉందని తనకి ఫోన్ చేసి తప్పుగా మాట్లాడాడని, దాంతో ఆమె భయంతో కళ్ళు తిరిగి పడిపోయినట్లు తెలిపింది.

 

అయితే అలా తను సృహలో లేని సమయంలో ఒక నిర్మాత తన పట్ల తప్పుగా ప్రవర్తించటమే కాకుండా తనని లొంగదీసుకోవటానికి ప్రయత్నించాడని సంచలన విషయాలు బయటపెట్టింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా బలగం సినిమా ద్వారా రూపా లక్ష్మికి మంచి గుర్తింపు రావటంతో ఆమెకు సినిమా అవకాశాలు ఎక్కువగా వస్తున్నట్లు ఈ సందర్భంగా రూపా లక్ష్మి వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -