Sai Dharam Tej: సాయితేజ్ ఇంటి ముందు రచ్చరచ్చ చేసిన మహిళ.. చివరకు?

Sai Dharam Tej: మెగా కుటుంబం నుంచి వచ్చిన యువ హీరో సాయి ధరమ్‌ తేజ్‌.. ఇటీవల యాక్సిడెంట్‌కు గురైన సంగతి తెలిసిందే. తర్వాత మెల్లగా కోలుకున్న అతడు.. ప్రస్తుతం సినిమాలు చేసుకోవడంలో బిజీగా గడుపుతున్నాడు. ఇటీవల రిపబ్లిక్‌ సినిమా చేసిన సాయితేజ్‌.. ఆ చిత్రం సందర్భంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ కళ్యాణ్‌ హాజరైన సంగతి తెలిసిందే. ఈవెంట్‌లో పొలిటికల్‌ హీట్‌ పుట్టించారు పవన్‌.

తర్వాత ఊహించినంత రేంజ్‌లో సినిమా హిట్‌ కాలేదు. తాజాగా హీరో సాయితేజ్‌ ఇంటి వద్ద ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మామూలుగా సెలబ్రిటీల ఇళ్ల ముందు అభిమానులు, సాధారణ జనం వస్తూనే ఉంటారు. తమ ఫేవరెట్‌ తారలను చూసేందుకు పరితపిస్తుంటారు. కొన్ని సార్లు కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేసి విఫలమవుతుంటారు. సాయితేజ్‌ ఇంటి వద్ద తెల్లవారుజామునే ఓ మహిళ హల్‌ చల్‌ చేసింది.

మతిస్థిమితం లేని మహిళగా గుర్తింపు..

సాయితేజ్‌ ఇంట్లోకి వెళ్లేందుకు ఆ మహిళ ప్రయత్నించింది. పదే పదే ఇంటి ముందు ఉన్న సెక్యూరిటీ వారితో వాదనకు దిగింది. దీంతో ఆమె వాదనను భరించలేని సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి సదరు మహిళను జూబ్లీహిల్స్ స్టేషన్‌కు తరలించారు. ఆమెను విచారించిన తర్వాత ఆసక్తికర విషయం తెలిసింది. ఆమె తమిళనాడులోని మధురైకి చెందిన మహిళ. ఆమె మతిస్థిమితం సరిగా లేదని గుర్తించారు.

 

ఈ నేపథ్యంలో ఆమె వివరాలను కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. ఇక సోషల్‌ మీడియాలో ఈ విషయంపై రచ్చ జరుగుతోంది. మరోవైపు సాయితేజ్‌ నటిస్తున్న విరూపాక్ష సినిమా గ్లిమ్స్‌ను విడుదల చేశారు. జూనియర్‌ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఆ వీడియో ఇప్పుడు అభిమానుల్లో అంచనాలు పెంచింది. ఈ సినిమాతో హిట్‌ కొట్టాలని సాయితేజ్‌ భావిస్తున్నారు. తన సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ మూవీ 2023 ఏప్రిల్‌లో రానున్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -