SaiTej: ప్రమాదంపై నోరు విప్పిన సాయితేజ్.. అలా జరిగిందంటూ?

SaiTej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ 2021 లో జరిగిన ప్రమాదంలో చావు అంచుల వరకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్ తేజ్ దాదాపుగా కోలుకోవడానికి ఏడు నుంచి ఎనిమిది నెలల సమయం పట్టింది. చాలామంది సాయి ధరమ్ తేజ్ బతకడం కష్టమే అని కూడా అనుకున్నారు. అటువంటిది అందరి ఆదరాభిమానాలు ప్రేమలు సాయి ధరమ్ తేజ్ ని మళ్ళీ మామూలు మనిషిని చేశాయి.

ఇక సాయి ధరమ్ తేజ్ కోలుకున్న తర్వాత హీరోగా నటించిన మొదటి సినిమా విరూపాక్ష. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీ బిజీగా గడుపుతున్నారు సాయి ధరమ్ తేజ్ చిత్ర బృందం. ఈ సందర్భంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి యాక్సిడెంట్ విషయం గురించి స్పందిస్తూ.. తనకు జరిగిన ఈ ప్రమాదం ఒక పీడకలగా భావించడం లేదని అది ఒక లెసన్ ఒక స్వీట్ మెమోరీ అని తెలిపారు సాయిధరమ్ తేజ్.

 

ఆ ప్రమాదం వల్ల చాలా నేర్చుకున్నానని,ముఖ్యంగా మాట విలువ తెలిసింది అని తెలిపారు. సాయి ధరమ్ తేజ్. అంతకు ముందు తాను చాటర్ బాక్స్ లా ఎక్కువ మాట్లాడే వాడినని, స్కూల్ నుంచి కాలేజీ వరకు ఇదే తీరు అని వివరించాడు. కానీ ఒక్కసారి గొంతు పెగలక, మాట రానపుడు దాని విలువ తెలిసిందని తెలిపారు. అయితే ఇంట్లో వాళ్లు, తరువాత షూటింగ్ లో తొటి నటులు, మామయ్య పవన్ కళ్యాణ్ అంతా ధైర్యం నూరిపోసారని, తన మాట అర్థం కాకపోయినా, ఏదీ మళ్లీ చెప్పు నెమ్మదిగా చెప్పు అని అడిగి మరీ అర్థం చేసుకునేవారని తెలిపారు సాయి తేజ్.

 

తన తల్లి తనకు ఎంతో ధైర్యం చెప్పిందని, మళ్లీ బైక్ ఎక్కనని అనుకుంటే, భయాన్ని జయించడం అవసరం అని చెప్పి, బైక్ ఎక్కించిందని గుర్తు చేసుకున్నారు. తనకు ఎంత మంది ఆప్తులు వున్నారో, తన కోసం ఎంత మంది ప్రార్థించారో తెలిసిన తరువాత ఇది కదా తాను సంపాదించిన ఆస్తి అని అర్థం అయిందన్నారు తెలిపారు సాయి. ప్రమాదం తరువాత అన్నింటికన్నా కీలకంగా తెలుసుకున్నది ఏమిటంటే..ఈ క్షణం బతకాలి.. వర్తమానంలో బతకాలి.. అన్నదే అని వివరించారు. అందుకే నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ, అందరితో కలిసి మెలిసి వుంటూ, జీవితాన్ని ఆస్వాదించాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు సాయి ధరమ్ తేజ్.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -