Salaar: సలార్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. మూవీ అలా ఉందంటూ?

Salaar: ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్. మూవీ రషెస్ చూసిన సినీ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధు ‘సలార్’ మూవీపై ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తుందని, హిట్ కన్‌ఫర్మ్ అని చెబుతున్నాడు. అయితే ప్రస్తుతం ప్రభాస్‌కి సాలిడ్ హిట్ కావాలి. ఎందుకంటే బహుబలి సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌కు.. ఆ తర్వాత విడుదలైన రెండు సినిమాలు భారీ నిరాశను మిగిల్చాయి. ‘సాహో’ నెగిటివ్ టాక్‌తో రూ.450 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. కానీ రాధేశ్యామ్ అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రభాస్ కెరీర్‌లో డిజాస్టర్ మూవీగా నిలిచింది. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ కన్ను ‘ఆదిపురుష్’ సినిమాపై పడింది. కానీ ఈ సినిమా టీజర్ విడుదలయ్యాక.. హిట్ అవుతుందనే ఆశకు నిరాశే మిగిలింది. వందల కోట్ల బడ్జెత్‌తో ఇలాంటి సినిమా తీశారా? అని డైరెక్టర్ ఓమ్‌రౌత్‌పై పలు విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు మరింతగా మెరుగులు దిద్దే పని జరుగుతోంది. దాంతో ప్రస్తుతం అందరి ఆశలు ‘సలార్’పైనే ఉంది.

 

 

రెండు సినిమాలతో పరాజయం పొందిన ప్రభాస్‌కు హిట్ ఇచ్చే బాధ్యత డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌పై పడింది. కేజీఎఫ్ తరహాలోనే ప్రభాస్‌కు రికార్డ్ బ్రేకింగ్ సినిమా ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్‌ను నమ్ముకున్న అభిమానులు.. ఈ సారి ‘సలార్’తో హిట్ కొట్టడం కన్‌ఫర్మ్ అని భావిస్తున్నారు. అయితే అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ‘సలార్’ సినిమా ఉంటుందని సమాచారం. సినీ క్రిటిక్ ఉమర్ సంధు తాజాగా ఈ సినిమాపై ఫస్ట్ రివ్వూ ఇచ్చాడు. ఆయన చేసిన కామెంట్లకు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ట్విట్టర్‌లో ఉమర్ సంధు మాట్లాడుతూ.. ’30 సెకన్ల నిడివి ఉన్న సలార్ రషెస్ చూశారు. చాలా అద్భుతంగా ఉంది. నోటి వెంట మాటలు రావడం లేదు. కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించాయి. 2023లో ప్రభాస్ తన సత్తా చూపిస్తాడు.’ అని పేర్కొన్నాడు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ‘సలార్’ హిట్ కొట్టడం ఖాయమని సంబరపడిపోతున్నారు. కాగా, సలార్ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్ నటిస్తోంది. కేజీఎఫ్ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని 2023 సమ్మర్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -